Suzuki Burgman 150 | సుజుకీ బర్గ్‌మాన్ నుంచి 150 సీసీ స్కూటర్.. ఇవీ ఫీచర్లు!

Suzuki Burgman 150 | జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకీ నుంచి సరికొత్త బర్గ్‌మాన్ 150 వస్తోంది. కొలంబియాలో ఈ స్కూటర్‌‌ను సుజుకీ ఆవిష్కరించింది.

Suzuki Burgman 150 | జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకీ నుంచి సరికొత్త బర్గ్‌మాన్ 150 వస్తోంది. కొలంబియాలో ఈ స్కూటర్‌‌ను సుజుకీ ఆవిష్కరించింది. ప్రస్తుతం భారత మార్కెట్‌లో మంచి ఆదరణ పొందుతున్న Suzuki Burgman Street 125 మోడల్‌కు ఇది మరింత ప్రీమియం వెర్షన్‌గా ఆటో మొబైల్ నిపుణులు భావిస్తున్నారు. 2018లో విడుదలైన బర్గ్‌మాన్ 125 మోడల్‌ భారత్‌లో 11 లక్షల మందికి పైగా కొనుగోలుదారులను ఆకర్షించింది. ఇప్పుడు సుజుకీ బర్గ్‌మాన్ 150 కొత్త డిజైన్, ఆధునిక ఫీచర్లు, శక్తివంతమైన ఇంజిన్‌తో వస్తుండటంతో దీనిపై అందరి ఆసక్తి పెరిగిపోయింది.

డిజైన్ పరంగా చూస్తే Suzuki Burgman Street 150 అనేది 125 సిరీస్‌కు కొత్త వెర్షన్‌లా అనిపించినప్పటికీ, ఇది ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంది. దీనికి గత మోడల్‌తో పోలిస్తే మరింత భారీగా కనిపించే ఫ్రంట్ ఏఫ్రాన్‌ను అందించారు. ఇందులో డ్యూయల్ చాంబర్ LED హెడ్‌ల్యాంప్స్, DRLs, ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్లను ఇచ్చారు. పూర్తిస్థాయిలో మ్యాక్సీ స్కూటర్లకు ఉండేలా సెంట్రల్ స్పైన్ డిజైన్‌తో పాటు ఫ్లాట్, స్లోపింగ్ ఫుట్ రెస్ట్ సెటప్‌ను అందించారు. దీంతో రైడింగ్ సమయంలో మరింత సౌకర్యం లభించనుంది.

ఫీచర్ల విషయానికి వస్తే పూర్తి కలర్ TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించారు. ఇందులో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, కీ లెస్ ఇగ్నిషన్ వంటి ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. 2026 బర్గ్‌మాన్ స్ట్రీట్ 125లో కూడా ఇవే ఫీచర్లు కానున్నాయి. ఎడమవైపు ఉన్న గ్లోవ్ బాక్స్‌లో 18 వాట్ల USB Type C చార్జింగ్ పోర్ట్‌ను ఏర్పాటు చేశారు. అదనంగా 25 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్‌ను కూడా అందించారు.

ఈ స్కూటర్ 149సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 8500rpm వద్ద గరిష్టంగా 14.2 bhp పవర్, 6500rpm వద్ద గరిష్టంగా 14.2nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి సీవీటీ గేర్‌బాక్స్ జత చేశారు. మైలేజ్ పెంచేందుకు Idle Start-Stop సిస్టమ్ కూడా పొందుపరిచారు.

సస్పెన్షన్ కోసం ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక భాగంలో డ్యూయల్ షాక్ అబ్జార్బర్లను అమర్చారు. ముందు, వెనుక 14 అంగుళాల సిక్స్ స్పోక్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. బ్రేకింగ్ వ్యవస్థలో ముందు, వెనుక డిస్క్ బ్రేక్స్‌తో పాటు డ్యూయల్ ఛానల్ ఏబీఎస్‌ను అందించారు. అదనంగా ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉండటం విశేషం. ఈ స్కూటర్ ఎత్తు 760 మిల్లీమీటర్ల ఎత్తు, బరువు145 కిలోలు (కెర్బ్ వెయిట్‌). ఇందులో 8 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌ను అందించారు.

బర్గ్‌మాన్ 150 భారత్‌లో విడుదలపై ఇప్పటివరకు అధికారిక సమాచారం లేదు. ఒకవేళ విడుదలైతే Hero Xoom 160, TVS Ntorq 150, Yamaha Aerox 155 మోడళ్లకు గట్టి పోటీని ఇచ్చే అవకాశం ఉందని ఆటోరంగ నిపుణులు భావిస్తున్నారు.

Read More:

దూకుడు పెంచిన టాటా మోటార్స్.. సియారా ఈవీ లాంచ్ కన్ఫార్మ్.. మరో రెండు కొత్త మోడళ్లు కూడా!

ఈ-క్లచ్ టెక్నాలజీతో హోండా కొత్త అడ్వెంజర్ బైక్.. ఏంటి దీని స్పెషాలిటీ!!

Latest News