Tata Sierra EV | దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ భారత మార్కెట్‌లో తన దూకుడును పెంచుతోంది. వచ్చే కొన్ని నెలల్లో వరుసగా కొత్త మోడళ్లను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో ఫోకస్ చేసిన టాటా మోటార్స్.. కొత్త ఎలక్ట్రిక్ SUVలు ఫేస్‌లిఫ్ట్ మోడళ్లు, ప్రీమియం కార్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. వీటిలో ముఖ్యంగా సియారా ఈవీ ( Sierra EV)పై భారీ అంచనాలే ఉన్నాయి.
2026-27 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలోనే సియారా ఈవీని లాంచ్ చేయనున్నట్లు టాటా ప్యాసింజర్ వెహికిల్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో శైలేశ్ చంద్ర ప్రకటించారు. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్‌తో నడిచే సియారా ఇప్పటికే భారత్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంది. కానీ ఎలక్ట్రిక్ వేరియంట్ వివరాలు మాత్రం ఇంకా గోప్యంగానే ఉన్నాయి. కాగా, ఇప్పటికే సియారా ఈవీ టెస్ట్ మ్యూల్స్ భారత రోడ్లపై కనిపించాయి. ఈ SUVలో ప్రత్యేక ఈవీ డిజైన్ అంశాలు ఉన్నాయి. క్లోజ్‌డ్ గ్రిల్, కొత్త LED లైటింగ్ సెటప్, కొత్త బంపర్ డిజైన్, ప్రత్యేక కలర్ ఆప్షన్లు ఇందులో ఉండే అవకాశం ఉంది.
2026 జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో సియారా ఈవీని లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ SUVల్లో పలు ఆధునిక ఫీచర్లు ఉండనున్నాయని సమాచారం. Sierra EVను 2026 జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ SUVలో పలు ఆధునిక ఫీచర్లు ఉండనున్నాయని తెలుస్తోంది. ICE వేరియంట్‌తో పోలిస్తే సియారా ఈవీలో కొన్ని ప్రత్యేక ఎలక్ట్రిక్ ఫీచర్లు అందించే అవకాశం ఉంది. వాటిలో V2L టెక్నాలజీ, V2V చార్జింగ్ సపోర్టు, డ్యూయల్ మోటర్ AWD సెటప్, పెద్ద బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉండనున్నాయి.
ఈ ఎలక్ట్రిక్ SUVలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ టెక్నాలజీ ప్రభావం కూడా కనిపించే అవకాశం ఉంది. Harrier EV, Curvv EV మోడళ్లలో ఉపయోగించే బ్యాటరీ, మోటార్ సెటప్‌ను సియారా ఈవీలో వినియోగించే అవకాశాలు ఉన్నాయి.
ప్రీమియం సెగ్మెంట్‌లోకి టాటా!
సియారా ఈవీతో పాటు మరో రెండు కొత్త మోడళ్లను కూడా టాటా మోటార్స్ భారత మార్కెట్‌లోకి తీసుకురానుంది. అందులో ముఖ్యమైనది అవిన్యా ఈవీ (Avinya EV). ఇది ప్రీమియం ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది. ఇది జాగ్వార్ ల్యాండ్ రోవర్‌కు చెందిన EMA (ఎలక్ట్రిఫైడ్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్) ప్లాట్‌ఫామ్‌పై రూపొందే అవకాశం ఉంది. లగ్జరీ ఫీచర్లు, విశాలమైన ఇంటీరియర్, ఆధునిక టెక్నాలజీతో ఈ మోడల్ మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ధర పరంగా ఈ కారు రూ.40 నుంచి 50 లక్షల వరకు ఉండొచ్చని అంచనా.
సఫారీ ఈవీ కూడా!
ఇక టాటా నుంచి సఫారీ ఈవీ కూడా ఈ ఏడాది చివరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది కంపెనీ తొలి 7 సీటర్ ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ SUV కానుంది. ఇది 7 సీట్ లేఅవుట్, భారీ బ్యాటరీ ప్యాక్, డ్యూయల్ మోటార్ AWD సిస్టమ్, ప్రీమియం ఫీచర్లతో మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మోడల్ భవిష్యత్తులో మహీంద్రా వంటి కంపెనీల ప్రీమియం ఎలక్ట్రిక్ SUVలకు గట్టి పోటీగా నిలవచ్చని ఆటోమొబైల్ నిపుణులు భావిస్తున్నారు.
Facelift మోడళ్లు కూడా!
కొత్త మోడళ్లతో పాటు ప్రస్తుతం ఉన్న పలు మోడళ్లకు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లు తెచ్చేందుకు టాటా మోటార్స్ సిద్ధమైంది. వాటిలో Tiago, Tiago EV, Tigor, Tigor EV మోడళ్లు ప్రధానంగా ఉండనున్నాయి. అదనంగా Nexon, Nexon EVలకు కూడా అప్‌డేట్స్ వచ్చే అవకాశం ఉంది.
ఉత్పత్తి పెంపుపైనా దృష్టి
టాటా వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ దృష్టా కంపెనీ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేలా ఫోకస్ చేసింది. ప్రస్తుతం కొన్ని మోడళ్లకు నాలుగు నుంచి 8 వారాల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంది. అయితే సియారా ఈవీ విడుదలైన తర్వాత ఈ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని టాటా మోటార్స్ భావిస్తుంది. అందుకే ఈ సమస్యను పరిష్కరించేందుకు భవిష్యత్తులో నెలకు 10 వేల యూనిట్లకు పైగా ఉత్పత్తిని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చంద్ర తెలిపారు.
Read More:
ఈ-క్లచ్ టెక్నాలజీతో హోండా కొత్త అడ్వెంజర్ బైక్.. ఏంటి దీని స్పెషాలిటీ!!
