Tax Benifits On Joint Home Loan : భార్య పేరున పెట్టుబడులు: ట్యాక్స్ నుంచి మినహాయింపులు

భార్య పేరున కొన్ని రుణాలు తీసుకుంటే పన్ను రాయితీ వస్తోంది. భార్యాభర్తలిద్దరూ జాయింట్‌గా హౌసింగ్ లోన్ తీసుకుంటే సుమారు రూ. 7 లక్షలు ఆదా చేసుకోవచ్చు. అసలు భార్య పేరున ఎంత పెట్టుబడి పెట్టవచ్చు, ట్యాక్స్ మినహాయింపు ఉంటుందా అనే విషయాలను తెలుసుకుందాం.

Tax Benifits On Joint Home Loan : భార్య పేరున పెట్టుబడులు: ట్యాక్స్ నుంచి మినహాయింపులు

భార్యతో కలిసి జాయింట్ గా హౌసింగ్ లోన్ తీసుకొంటే…….

ప్రస్తుత సమాజంలో భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే హౌసింగ్ లోన్ తీసుకొనే సమయంలో భార్యాభర్తలు కలిసి జాయింట్ గా లోన్ తీసుకొంటే కొన్ని ప్రయోజనాలున్నాయి. జాయింట్ గా భార్యాభర్తలు హౌసింగ్ లోన్ తీసుకుంటే రూ. 7 లక్షలు పన్ను రూపంలో ఆదా చేసుకోవచ్చు. హౌసింగ్ లోన్ పై 80 సీ కింద రూ. 1.5 లక్షలు క్లైయిమ్ చేసుకోవచ్చు. ఈ లెక్కన దంపతులు ఇలా రూ. 3లక్షలను ఆదా చేసుకోవచ్చు. మరో వైపు ఐటీ చట్టం సెక్షన్ 24 కింద దంపతులు చెల్లించిన వడ్డీపై ఒక్కొక్కరు రూ. 2 లక్షలు చొప్పున క్లైయిమ్ చేసుకోవచ్చు. అంటే భార్యాభర్తలకు రూ. 4 లక్షలు కలిసివస్తుంది. అంటే హౌసింగ్ లోన్ జాయింట్ గా తీసుకుంటే రూ. 7 లక్షలు ఆదా అవుతుంది. అంతేకాదు జాయింట్ గా బీమా పాలసీ తీసుకుంటే కూడా ప్రీమియం తక్కువగా ఉంటుంది. దీనికితోడు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపుపై ఐటీ చట్టంలోని సెక్షన్ 80 డీ కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. .80 సీ సెక్షన్ కింద పన్ను మినహాయింపు కోసం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్, పన్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్లు, హోమ్ లోన్ ప్రిన్సిపల్ చెల్లింపుల ద్వారా డబ్బు ఆదా చేసుకోవచ్చు.

భార్య పేరుతో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు కొనుగోలు

భార్య పేరుతో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే ట్యాక్స్ సేవ్ అవుతుంది. అంటే మూలధన లాభాలపై రూ. 1 లక్ష వరకు పన్ను మినహాయింపులు ఉంటాయి. జీవిత భాగస్వామికి ఎలాంటి ఆదాయం లేని సందర్భంలోనైనా ఇది వర్తిస్తోంది. పెట్టుబడి కోసం భార్య లేదా భర్తకు కొంత డబ్బును బదిలీ కూడా చేసుకోవచ్చు. జీవిత భాగస్వామికి బహుమతిగా ఆస్తులు లేదా డబ్బులు ఇచ్చినాఎలాంటి పన్ను ఉండదు. కానీ, కానుకగా ఇచ్చిన మొత్తం నుంచి వచ్చే ఆదాయం…ఎవరైతే కానుక ఇచ్చారో వారి ఆదాయంతో కలిసిపోతోంది. అంటే భర్త తన భార్యకు రూ. 10 లక్షలు గిఫ్ట్ ఇస్తే.. ఆమె దాన్ని ఎఫ్ డీ చేస్తే ఆ వడ్డీ భర్త ఆదాయంలో కలుస్తోంది. అయితే కానుకగా వచ్చిన నిధులను పీపీఎఫ్ లేదా దీర్ఘకాలంలో పెట్టుబడులు పెట్టాలి.

ఎడ్యుకేషన్ లోన్

కొందరు పెళ్లైనా తర్వాత కూడా చదువుకుంటారు. అలాంటి సమయంలో భార్య పేరున ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవచ్చు. దీని వల్ల ట్యాక్స్ బెనిఫిట్ లభిస్తోంది. ఐటీ చట్టం 80 ఈ ప్రకారం ఈ లోన్ పై చెల్లించే వడ్డీపై ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. ఎనిమిదేళ్ల వరకు ఈ ట్యాక్స్ బెనిఫిట్ పొందవచ్చు. అయితే ప్రభుత్వ బ్యాంకులు లేదా ప్రభుత్వ సంస్థల నుంచి ఈ లోన్లు తీసుకొంటేనే ఇది వర్తిస్తుంది. భార్యాభర్తలు ఉద్యోగులైతే ఎల్ టీ ఏకు కూడా అర్హత ఉంటుంది. నాలుగగేళ్లకు రెండుసార్లు ఎల్‌టీఏ క్లైయిమ్ చేసుకోవచ్చు.