Tesla India | భారత్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న ఎలాన్ మస్క్ టెస్లా

Tesla India | ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన TESLA కంపెనీ భారత్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ జులై 15న భారత్‌లో ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ లాంచ్ చేయబోతున్నట్లుగా టెస్లా ప్రతినిధులు వెల్లడించారు. ముంబై బీకేసీలో తన మొదటి షోరూమ్ ప్రారంభిస్తున్నట్లు ‘ఎక్స్’ వేదికగా కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. టెస్లా ఫిబ్రవరిలో ఢిల్లీ, ముంబాయ్ లలో తమ సంస్థలలో పనిచేసేందుకు లింక్ఢ్ ఇన్ వేదికగా నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ క్రమంలో తొలి షోరూమ్ ను ఈ నెల ముంబైలో ప్రారంభించబోతుంది.TESLA ఎంట్రీతో భారతీయ EV రంగం మరింత వేగవంతమవుతుందని నిపుణులు భావిస్తున్నారు.
అయితే కేవలం షోరూమ్ లకే టెస్లా పరిమితం కాకుండా భారత్ లో తన ఫ్లాంట్ నెలకొల్పాలని భారత ప్రభుత్వం ఆశిస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో TESLA భారత్ లో ఉత్పాదక ఫ్లాంటు పెడుతుందని గత జనవరిలో భారత్ లో పర్యటించిన ఎలాన్ మస్క తండ్రి ఎరాల్ మస్క్ ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశంలో టెస్లా ఫ్లాంట్ రావడంలో సందేహం వద్దని వ్యాఖ్యానించారు. భారత ప్రయోజనాలను ప్రధాని మోదీ కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటారన్నారు. TESLA కంపెనీ ప్రయోజనాలను Elon Musk కాపాడతారని ధీమాగా చెప్పారు. ఈ ఇద్దరూ కలిసే ఒక సరైన నిర్ణయానికి వస్తారని తన భారత్ పర్యటనలో ఎరాల్ మస్క్ తెలిపారు. షోరూమ్ నుంచి కార్ల తయారీ కంపెనీకి టెస్లా నిర్ణయం తీసుకుంటే ఆ మేరకు భారత్ లో మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయి.