Ratan Tata | నా గురించి ఆలోచిస్తున్నందుకు ధ‌న్య‌వాదాలు.. ర‌త‌న్ టాటా చివ‌రి ట్వీట్ ఇదే..

Ratan Tata | భార‌త పారిశ్రామిక‌వేత్త ర‌త‌న్ టాటా( Ratan Tata ).. అక్టోబ‌ర్ 7వ తేదీన చివ‌రి సారిగా ట్వీట్ చేశారు. త‌న ఆరోగ్య ప‌రిస్థితిపై వివ‌ర‌ణ ఇచ్చిన ఆయ‌న రెండు రోజుల‌కే తుదిశ్వాస విడిచారు.

Ratan Tata | నా గురించి ఆలోచిస్తున్నందుకు ధ‌న్య‌వాదాలు.. ర‌త‌న్ టాటా చివ‌రి ట్వీట్ ఇదే..

Ratan Tata | దిగ్గ‌జ పారిశ్రామిక‌వేత్త‌, ప‌ద్మ‌విభూష‌ణ్ గ్ర‌హీత‌, టాటా స‌న్స్ గౌర‌వ చైర్మ‌న్ ర‌త‌న్ టాటా( Ratan Tata )(86) బుధ‌వారం రాత్రి తుదిశ్వాస విడిచారు. అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా ముంబై( Mumbai )లోని బ్రీచ్ క్యాండీ ఆస్ప‌త్రి( Breach Candy Hospital ) ఐసీయూలో చికిత్స పొందుతూ బుధ‌వారం రాత్రి 11.30 గంట‌ల‌కు క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే.

అయితే అక్టోబ‌ర్ 7వ తేదీన మ‌ధ్యాహ్నం 12.39 గంట‌ల‌కు ర‌త‌న్ టాటా చివ‌రి ట్వీట్ చేశారు. అది కూడా త‌న ఆరోగ్య ప‌రిస్థితిపై ఆయ‌న ఎక్స్ వేదిక‌గా స్పందించారు. త‌న ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వ‌స్తున్న పుకార్ల‌పై ఆయ‌న వివ‌ర‌ణ ఇచ్చారు. నా ఆరోగ్యం బాగానే ఉంది. వైద్య ప‌రీక్ష‌ల కోస‌మే ఆస్ప‌త్రికి వెళ్లా. ఎలాంటి ఆందోళ‌న అవ‌స‌రం లేదు. ప్ర‌జ‌లు, మీడియా త‌ప్పుడు స‌మాచారాన్ని వ్యాప్తి చేయొద్ద‌ని అభ్య‌ర్థిస్తున్నాన‌ని ర‌త‌న్ టాటా త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. మీరు నా గురించి ఆలోచిస్తున్నందుకు ధ‌న్య‌వాదాలు అని ర‌త‌న్ టాటా పేర్కొన్నారు.