LIC | ‘ఆరోగ్య బీమా’లోకి వచ్చే యోచన లేదు.. స్టాక్‌ మార్కెట్‌లకు స్పష్టం చేసిన ఎల్‌ఐసీ

LIC | జీవిత బీమా పాలసీలతోపాటుగా ఆరోగ్య బీమా పాలసీలను కూడా అందించాలనే యోచన ప్రస్తుతానికి తమకు లేదని 'లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (LIC)' స్పష్టం చేసింది. ఈ మేరకు స్టాక్‌ మార్కెట్లకు ఒక ప్రకటనలో సమాచారం ఇచ్చింది. త్వరలోనే ఎల్‌ఐసీ కూడా ఆరోగ్య బీమా పాలసీలను అందించబోతోంది అంటూ వార్తలు రావడంతో ఈ వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

LIC | ‘ఆరోగ్య బీమా’లోకి వచ్చే యోచన లేదు.. స్టాక్‌ మార్కెట్‌లకు స్పష్టం చేసిన ఎల్‌ఐసీ

LIC : జీవిత బీమా పాలసీలతోపాటుగా ఆరోగ్య బీమా పాలసీలను కూడా అందించాలనే యోచన ప్రస్తుతానికి తమకు లేదని ‘లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (LIC)’ స్పష్టం చేసింది. ఈ మేరకు స్టాక్‌ మార్కెట్లకు ఒక ప్రకటనలో సమాచారం ఇచ్చింది. త్వరలోనే ఎల్‌ఐసీ కూడా ఆరోగ్య బీమా పాలసీలను అందించబోతోంది అంటూ వార్తలు రావడంతో ఈ వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

సంస్థ వృద్ధి, విస్తరణ కోసం ఉన్న అన్ని అవకాశాలనూ వ్యూహాత్మకంగా వినియోగించుకుంటామని, ఇందులో భాగంగా కొన్ని భాగస్వామ్యాలు కుదుర్చుకోవడం, పెట్టుబడులు పెట్టడం లాంటి చర్యలు కొనసాగుతాయని స్టాక్‌ మార్కెట్‌లకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. ప్రస్తుతం బీమా చట్టం 1938 ప్రకారం.. జీవిత బీమా సంస్థలు ఆరోగ్య బీమా పాలసీలను అందించడం కుదరదు.

ఆరోగ్య బీమా పాలసీలను కేవలం సాధారణ బీమా సంస్థలు లేదా ఆరోగ్య బీమా సంస్థలు మాత్రమే అందించాలి. ఈ నిబంధనలను మార్చి బీమా సంస్థలకు కాంపోజిట్‌ లైసెన్సు అందించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం ఒక పార్లమెంటరీ కమిటీని కూడా నియమించింది. ఫిబ్రవరిలో ఈ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.

జీవిత బీమా, సాధారణ బీమా, ఆరోగ్య బీమా పాలసీలన్నీ ఒకే సంస్థ నుంచి ఇచ్చేందుకు వీలు కల్పించాలని, తద్వారా బీమా విస్తృతి పెరుగుతుందని కమిటీ తన నివేదికలో పేర్కొన్నది. ఈ నేపథ్యంలో ఎల్‌ఐసీకి సైతం కాంపోజిట్‌ లైసెన్సు లభిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎల్‌ఐసీ కూడా ఆరోగ్య బీమా రంగంలో అడుగుపెడుతుందనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఎల్‌ఐసీ అలాంటిదేమీ లేదని స్పష్టతనిచ్చింది.