TVS Norton Atlas | ద్విచక్ర వాహన మార్కెట్‌లో అడ్వెంచర్ బైక్ సెగ్మెంట్ వేగంగా విస్తరిస్తున్న వేళ TVS Motor Company కీలక అడుగువేసింది. బ్రిటీష్ ప్రీమియం బైక్ బ్రాండ్ నార్టన్ మోటార్‌సైకిల్స్ ( Norton Motorcycles)ను టీవీఎస్ 2020లోనే స్వాధీనం చేసుకోగా.. ఇప్పుడు భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే నార్టన్ అట్లాస్ 585 మోడల్‌ను పూర్తిగా దేశీయంగానే తయారు చేయనుంది. దీనికోసం తమిళనాడులోని హోసూర్ ప్లాంట్‌లో ప్రత్యేక అసెంబ్లీ లైన్‌ను ఏర్పాటు చేసింది.
ఈ ఏడాది చివరలోనే నార్టన్ అట్లాస్ 585 మోడల్‌ను భారత మార్కెట్‌లోకి అధికారికంగా విుదల చేసే అవకాశం ఉందని ఆటోమొబైల్ వర్గాలు చెబుతున్నాయి. ఇది రెండు వేరియంట్లలో రానుంది. Norton Atlas Standard, Atlas GT వేరియంట్లలో ఇవి వస్తున్నాయి. వీటిలో అట్లాస్ జీటీ రోడ్ ఫోకస్‌డ్ అడ్వెంర్ టూరర్ కాగా, అట్లాస్ స్టాండర్డ్ ఆఫ్‌రోడింగ్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన మోడల్ అని సమాచారం. అయితే మొదట భారత్‌లో అట్లాస్ జీటీ వేరియంట్‌ను మాత్రమే భారత్‌లో విడుదల చేసే అవకాశం ఉంది.
డిజైన్‌పరంగా చూస్తే ఈ బైక్ మస్క్యులర్ లుక్‌తో ఆకట్టుకోనుంది. ముందు భాగంలో స్ప్లిట్ LED హెడ్‌ల్యాంప్ సెటప్, దిగువ భాగాన్ని చుట్టే DRLs పెద్ద ట్రాన్స్‌పరెంట్ విండ్ స్క్రీన్, USD ఫోర్క్స్, 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఈ బైక్‌కు ప్రీమియం లుక్‌ను ఇస్తున్నాయి. ముందు భాగంలో డ్యుయెల్ డిస్క్ బ్రేకులు, వెనుక భాగంలో స్లీక్ టెయిల్ సెక్షన్, LED ఇండికేటర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
ఫీచర్ల విషయానికి వస్తే ఈ నార్టన్ అట్లాస్ జీటీ బైక్‌లో ప్రీమియం సెగ్మెంట్‌కు తగిన విధంగా ఆధునిక సాంకేతికతనను అందించనున్నారు. కీలెస్ ఇగ్నిషన్, నాలుగు రైడ్ మోడ్‌లు (Sport, Touring, Urban, Off Road ), ట్రాక్షన్ కంట్రోల్, బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్, 8 అంగుళాల TFT డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అడ్వెంచర్ టూరింగ్‌కు అనుకూలంగా దీర్ఘ ప్రయాణాల్లో కూడా సౌకర్యవంతమైన రైడింగ్ అనుభూతి కలిగించేలా దీన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం.
ఈ బైక్‌లో 585సీసీ ప్యారెలల్ ట్విన్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను అందించనున్నారు. ఈ ఇంజిన్ సుమారు 65 నుంచి 70 bps పవర్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. ఇంజిన్ నిర్మాణం రాబోయే BMW F450 GS మోడల్‌ను పోలి ఉండొచ్చని తెలుస్తోంది. తక్కువ ఆర్‌పీఎం నుంచే మెరుగైన టార్క్ అందించేలా దీన్ని మార్చనున్నారు. లాంగ్ రైడ్‌లో ఇంజిన్ వేడి తగ్గించేందుకు ప్రత్యేక హీట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ కూడా ఉండే అవకాశం ఉంది.
భారత మార్కెట్‌లో దీని ధర రూ.6లక్షల నుంచి రూ.7లక్షల మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. నార్టన్ అట్లాస్ మోడల్‌తో పాటు Manx R, Manx Naked Sports మోడళ్లను కూడా భవిష్యత్తులో భారత్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
Read More:
Honda NX500 | ఈ-క్లచ్ టెక్నాలజీతో హోండా కొత్త అడ్వెంజర్ బైక్.. ఏంటి దీని స్పెషాలిటీ!!
