What Is Inflation ? | ద్రవ్యోల్బణం అంటే ఏంటి?

వస్తువుల ధరలు పెరుగుతున్నాయి, కానీ డబ్బు విలువ ఎందుకు తగ్గుతోంది? ద్రవ్యోల్బణం అంటే ఏమిటో, అది మీ జీవనంపై ఎలా ప్రభావం చూపుతుందో తెలుసుకోండి.

What Is Inflation ? | ద్రవ్యోల్బణం అంటే ఏంటి?

ద్రవ్యోల్బణం అంటే ఏంటి? ఇది ఆర్ధిక వ్యవస్థపై ఏ రకమైన ప్రభావం చూపుతోంది? ప్రజల కొనుగోలు శక్తిపై ద్రవ్యోల్బణం ఎలా పనిచేస్తోంది? ద్రవ్యోల్బణంలో రకాలు ఏంటి? ద్రవ్యోల్బణం పెరగడం లాభమా, నష్టమా? ద్రవ్యోల్బణం నుంచి డబ్బును ఎలా ఆదా చేసుకోవాలో తెలుసుకుందాం.

అసలు ద్రవ్యోల్బణం అంటే ఏంటి?

ద్రవ్యోల్బణం అంటే వస్తువులు, సేవల ధరలు క్రమంగా పెరగడం దీనివల్ల డబ్బు కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. ఒకే మొత్తంలో డబ్బుతో గతంలో కొన్న దానికంటే తక్కువ వస్తువులు, సేవలను కొనుగోలు చేయగలరు. ఆర్ధిక వ్యవస్థలో చలామణి అయ్యే పెరిగినప్పుడు ద్రవ్యోల్బణం సంబవిస్తుంది. ఉదాహరణకు కేంద్ర బ్యాంకులు , ఆర్ధిక డిమాండ్లను తీర్చడానికి అదనపు కరెన్సీని ముద్రించవచ్చు. ద్రవ్య సరఫరా విస్తరించినప్పుడు ప్రతి కరెన్సీ యూనిట్ కొంత విలువను కోల్పోతుంది. సాధారణంగా ప్రజల మాటల్లో చెప్పాలంటే వస్తువుల ధరలు పెరిగిపోయి, డబ్బు విలువ, ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయే పరిస్థితినే ద్రవ్యోల్బణం అంటారు.

ద్రవ్యోల్బణంలో ఎన్ని రకాలు?

ద్రవ్యోల్బణంలో పలు రకాలున్నాయి. వాటిని పాకుతున్న ద్రవ్యోల్బణం, నడుస్తున్న ద్రవోల్బణం, పరిగెత్తే ద్రవ్యోల్బణం, దూకుతున్న ద్రవ్యోల్బణం, డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం, వ్యయప్రేరిత ద్రవ్యోల్బణం, అంతర్లీన ద్రవ్యోల్బణంగా గుర్తించారు. ఏడాదిలో ద్రవ్యోల్బణం పెరుగుదల ఆధారంగా వాటికి ఈ పేర్లు పెట్టారు. ఏడాదిలో మూడు శాతానికి మించకుండా ధరల పెరుగుదల ఉంటే దాన్ని పాకుతున్న ద్రవ్యోల్బణం అంటారు. ధరల పెరుగుదల 3 నుంచి 10 శాతం మధ్యలో దాన్ని నడుస్తున్న ద్రవ్యోల్బణం అంటారు. ధరల పెరుగుదల 10 శాతం కంటే ఎక్కువ ఉంటే పరిగెత్తే ద్రవ్యోల్బణం అంటారు. ధరల పెరుగుదుల ఎక్కువగా ఉంటే అంటే వంద శాతం ధరలు పెరిగితే దాన్ని దూకుతున్న ద్రవ్యోల్బణం అంటారు. సమిష్టి డిమాండ్ లో కలిగే పెరుగుదల వల్ల ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటారు. ఉత్పత్తి కారకాల ధరల పెరుగుదల వల్ల సమిష్టి సప్లయ్ తగ్గడం వల్ల ఏర్పడేది వ్యయప్రేరిత ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. దీని వల్ల ఉత్పత్తి ధరలు పెరిగి వస్తువుల ధరలు పెరుగుతాయి. వేతనాలు పెరగాలనే ఉద్యోగులు,కార్మికుల ఆశలు ద్రవ్యోల్బణానికి ప్రేరణ కల్పిస్తాయి. దారితీస్తాయి.

ద్రవ్యోల్బణం పెరగడానికి కారణాలు ఏంటి?

డిమాండ్ ప్రేరిత, వ్యయ ప్రేరిత అంశాలు ద్రవ్యోల్బణం పెరుగుదలకు ప్రధాన కారణాలుగా చెబుతారు. డిమాండ్ ప్రేరిత అంశం వల్లే ఇండియాలో కూడా ద్రవ్యోల్బణం పెరగుతుంది. జనాభా పెరుగుదల వల్ల వస్తు, సేవల డిమాండ్ పెరుగుతుంది. ఒక దేశం ఆర్ధికంగా అభివృద్ది చెందితే ప్రజల ఆదాయాలు పెరిగి వస్తు, సేవల డిమాండ్ పెరుగుతుంది. ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాలు, ఉపాధి కల్పించడం వల్ల వస్తు, సేవల డిమాండ్ పెరగనుంది. ద్రవ్య చలామణి పెరిగి వస్తు, సేవలకు డిమాండ్ పెరుగుతుంది. శ్రామికుల వేతనాలు పెరగడం వల్ల ఉత్పత్తి ఖర్చు పెరుగుతుంది. పరిశ్రమల ఆధునీకీకరణ తో కూడా ఉత్పత్తి ఖర్చు పెరుగుతుంది. అదనపు ఆదాయం కలిగి ఉన్న వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది. దీంతో వారి కొనుగోలు అలవాట్లు మారి వస్తు, సేవల డిమాండ్ పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. వీటితో పాటు మూలధన సమస్య, శ్రామిక నైపుణ్య సమస్య, రవాణా సౌకర్యాల సమస్య, ఆహార భద్రత లేమి, వ్యవస్థాపక నైపుణ్యం లేకపోవడం వంటివి కూడా ద్రవ్యోల్బణానికి కారణం అవుతాయి.

కొనుగోలు శక్తి పడిపోవడం

ద్రవ్యోల్బణం కారణంగా ఒక నిర్ధిష్ట మొత్తంలో ఉన్న డబ్బు విలువ తగ్గుతుంది. ఇది వినియోగదారుల కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది. అంటే ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్నప్పుడు వంద రూపాయాలతో మీరు గతంలో కొన్న వస్తువులు, లేదా సరుకులు ఇప్పుడు కొనలేరు. వంద రూపాయాల కంటే ఎక్కువ ఖర్చు చేస్తేనే గతంలో మీరు కొనుగోలు చేసిన వస్తువులు, సరుకులు ఇప్పుడు అందే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం నడక స్థాయిలో ఉంటే ఇబ్బంది లేదు. దూకుడుగా ఉంటే ఆర్ధిక అస్థిరతను సృష్టిస్తోంది. అంటే కాలక్రమేణ ద్రవ్యోల్బణం కారణంగా డబ్బు వాస్తవ విలువను తగ్గిస్తుంది. వడ్డీరేట్లు, పెట్టుబడి, రాబడి, ఆర్ధిక విధానాలను ద్రవ్యోల్బణం ప్రభావితం చేస్తుంది.

పెట్టుబడిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

కాలక్రమంలో పెట్టుబడులపై వాస్తవ విలువను ద్రవ్యోల్బణం తగ్గిస్తుంది. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటే మీరు పెట్టుబడుల నుంచి సంపాదించే డబ్బు కూడా తక్కువ కొనుగోలు శక్తిని కలిగి ఉంటుంది. ఉదహరణకు మీరు పెట్టుబడిపై నాలుగు శాతం రాబడి ఉందనకుందాం. అదే సమయంలో ద్రవ్యోల్బణం ఐదు శాతం ఉంటే మీ వాస్తవ రాబడి ప్రతికూలంగా ఉంటుంది. అంటే మీ ఆదాయాలు పెరిగిన ద్రవ్యోల్బణానికి అనుగుణంగా లేవని చెప్పవచ్చు. మరోక ఉదహరణను తీసుకుందాం. మీరు ఏదైనా స్టాక్ లోనో , రియల్ ఏస్టేట్ లో పెట్టిన పెట్టుబడిపై ఆరు శాతం రాబడి వచ్చిందనుకుందాం. అప్పుడు ద్రవ్యోల్బణం మూడు శాతంగా ఉంటే నిజమైన రాబడి మూడు శాతమే. అంటే మీరు పెట్టుబడులు పెట్టే సమయంలో ద్రవ్యోల్బణానికి సమానంగా లేదా అంతకంటే ఎక్కువ లాభం వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి. అంటే తక్కువ పెట్టుబడి పెట్టినా ఎక్కువగా లాభం వచ్చే మార్గాల్లో పెట్టుబడులు పెట్టాలి. ధరలు పెరిగే సమయంలో తెలివిగా పెట్టుబడులు పెట్టాలి. పొదుపు కూడా ముఖ్యమే. అవసరాలు, కోరికలను విభజించుకోవాలి. అవసరాలకు ఖర్చు చేయాలి. కోరికలకు అంటే లగ్జరీ కోసం చేసే ఖర్చులను తగ్గించుకోవాలి.