Radhika Merchant | అనంత్‌ అంబానీతో పెళ్లికి ముందు ఎవరీ రాధికా మర్చంట్‌.. ఆమె పుట్టింటి నేపథ్యం ఏమిటి..?

Radhika Merchant | రాధిక మర్చంట్‌ ఎవరు అనే విషయం చాలామందికి తెలియదు. రాధిక మర్చంట్‌ తల్లిదండ్రులు ఎవరు..? ఆమె తండ్రి ఏం చేస్తుంటారు..? ఆయన నేపథ్యం ఏమిటి..? ఈ పెళ్లి సంబంధం ఎలా కుదిరింది..? తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

  • By: Thyagi |    business |    Published on : Jul 17, 2024 8:35 AM IST
Radhika Merchant | అనంత్‌ అంబానీతో పెళ్లికి ముందు ఎవరీ రాధికా మర్చంట్‌.. ఆమె పుట్టింటి నేపథ్యం ఏమిటి..?

Radhika Merchant : ఆసియా ఖండంలోనే అత్యంత కుబేరుడైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అబానీ ఇటీవల తన చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ వివాహాన్ని అంగరంగ వైభంగా చేశారు. దాదాపు ఆరు నెలలపాటు ఈ పెళ్లి వేడుకలు జరిగాయి. సుమారు రూ.5 వేల కోట్లను ఈ పెళ్లి కోసం ఖర్చు చేశారు. భారతదేశంలో ఇప్పటివరకు ఎవరూ చేయనంత గొప్పగా ఈ పెళ్లి జరిపించారు. ఈ పెళ్లి ద్వారా వధువు రాధికా మర్చంట్‌ అంబానీ ఇంట కోడలిగా అడుగుపెట్టింది. అయితే ఈ రాధిక మర్చంట్‌ ఎవరు అనే విషయం చాలామందికి తెలియదు. రాధిక మర్చంట్‌ తల్లిదండ్రులు ఎవరు..? ఆమె తండ్రి ఏం చేస్తుంటారు..? ఆయన నేపథ్యం ఏమిటి..? ఈ పెళ్లి సంబంధం ఎలా కుదిరింది..? తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం…

రాధిక పేరెంట్స్‌ వీరేన్‌ మర్చంట్‌-శైలా మర్చంట్‌

ఎన్‌కోర్‌ హెల్త్‌కేర్‌ సంస్థ వ్యవస్థాపకులు, యజమానులు అయిన వీరేన్‌ మర్చంట్‌-శైలా మర్చంట్‌ దంపతుల చిన్న కుమార్తె రాధికా మర్చంట్‌. రాధిక తండ్రి ఎన్‌కోర్‌ హెల్త్‌కేర్‌ సీఈవో, ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్, స్టీల్‌ తయారీ సంస్థ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. రాధిక తల్లి శైలా మర్చంట్‌ ఎన్‌కోర్‌ హెల్త్‌ కేర్‌ సంస్థ బోర్డు డైరెక్టర్‌గా ఉన్నారు. రాధిక మర్చంట్‌ తన పాఠశాల విద్యను కేథడ్రల్ స్కూల్‌, జాన్‌ కానన్‌ స్కూల్, ఎకోల్‌ మొండియల్‌ వరల్డ్‌ స్కూల్‌లో చదివారు. బీడీ సోమాని ఇంటర్నేషనల్‌ స్కూల్‌ నుంచి డిప్లొమా కూడా పొందారు. న్యూయార్క్‌ యూనివర్సిటీ నుంచి పొలిటికల్‌ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్‌ చేశారు.

రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలో రాధిక ఉద్యోగం

భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత రాధికా మర్చంట్‌ ఇస్ప్రవా అనే లగ్జరీ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలో చేరారు. ఒక సంవత్సరంపాటు ఆ సంస్థలో పనిచేశారు. తర్వాత ఆమె తమ సొంత కంపెనీ ఎన్‌కోర్‌ హెల్త్‌కేర్‌లో చేరారు. రాధిక మర్చంట్‌ భరతనాట్యంలో కూడా శిక్షణ పొందారు. 2022 జూన్‌లో రాధికా మర్చంట్‌ ముంబైలోని జియో వరల్డ్‌ సెంటర్‌లో తొలిసారి అడుగుపెట్టి తన భరతనాట్య ప్రదర్శన చేశారు. ఈ ఇద్దరు స్నేహితులే ఇప్పుడు దంపతులయ్యారు.

రాధిక, అనంత్‌ దోస్తులే..

రాధికా మర్చంట్, అనంత్‌ అంబానీల పరిచయం కొత్తదేమీ కాదు. వాళ్లిద్దరూ చిన్ననాటి దోస్తులే. కాబట్టి అనంత్‌ స్నేహితురాలిగా ఆమె ముకేశ్‌ అంబానీ నివాసానికి రాధిక తరచూ అతిథిగా వస్తుండేది. 2018లో ఆనంద్‌ పిరమల్‌తో ఇషా అంబానీ వివాహానికి, 2019లో ఆకాశ్‌-శ్లోకా వివాహానికి కూడా రాధికా మర్చంట్‌ హాజరయ్యారు.

రాధికా మర్చంట్‌ సోదరి అంజలి

రాధికా మర్చంట్‌ అక్క అంజలీ మర్చంట్‌ కుటుంబ వ్యాపార సామ్రాజ్యంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ముందుగా తండ్రి విరేన్‌ మర్చంట్‌ ఫార్మా కంపెనీలో పనిచేశారు. తర్వాత ఈహెచ్‌ఎల్‌పీ కంపెనీలో మొదట్లో జనరల్‌ మేనేజర్‌గా చేరి, తర్వాత మేనేజర్‌-మార్కెటింగ్, క్లయింట్‌ ఔట్రీచ్‌ ఎగ్జిక్యూటివ్‌గా రాణించారు. 2021లో ఈహెచ్‌ఎల్‌పీ అభివృద్ది, విస్తరణలో ముఖ్య పాత్ర పోషించి ఆ కంపెనీ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లలో ఒకరిగా మారారు. అలాగే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ రంగంలోకి అడుగుపెట్టారు. తర్వాత మైలూన్‌ మెటల్స్‌ కంపెనీని స్థాపించి అలియా భట్, టబు వంటి ప్రముఖులు యాడ్స్‌ చేసిన హెయిర్‌ స్టైలింగ్, ట్రీట్మెంట్‌ క్లబ్‌ సీఈఓగా గుర్తింపు తెచ్చుకున్నారు.

అంజలి పర్సనల్ లైఫ్‌

అంజలి కూడా స్వదేశంలో పాఠశాల విద్యను పూర్తిచేసుకుని, ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లారు. ఉన్నత విద్యను అభ్యసించి భారత్‌కు తిరిగొచ్చారు. 2020లో ప్రముఖ వ్యాపారవేత్త అమన్‌ మజిథియాను వివాహం చేసుకున్నారు. ఇప్పుడు వీరికి ఒక బాబు ఉన్నాడు. అమన్‌ మజిథియా ఈహెచ్‌ఎల్‌పీ కంపెనీలో అసోసియేట్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. అలాగే కంపెనీలోని సీఎంవో యూనిట్‌ కార్యాచరణ అంశాలను చూసుకుంటారు. అంజలి నికర ఆస్తుల విలువ సుమారు రూ.2 వేల కోట్లకు పైగానే ఉంటుంది.