The Thaandavam Lyrical Video : అఖండ 2 తాండవం.. సాంగ్ విడుదల..థియేటర్లలో శివతాండవమే..!
అఖండ 2 నుంచి విడుదలైన ‘తాండవం’ సాంగ్‌లో బాలయ్య అఘోర లుక్, శివతాండవ యాక్షన్‌తో గూస్‌బంప్స్ తెప్పించారు. తమన్ మ్యూజిక్‌తో సినిమాలో హైప్ పెరిగింది.
విధాత : నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అఖండ 2’ తాండవం సినిమా నుంచి మేకర్స్ శుక్రవారం అఖండ..తాండవం అనే టైటిల్ సాంగ్ ను విడుదల చేశారు. పాటలో బాలయ్య అఘోర పాత్రలో శివభక్తుడిగా పూనకాలు తెప్పించే యాక్షన్, శివ తాండవం..పోరాటాలతో ఆకట్టుకున్నారు. ఈ పాటకు లిరిక్స్ కల్యాణ్ చక్రవర్తి రాయగా.. శంకర్ మహాదేవన్, కైలాశ్ ఖేర్, దీపక్ ఆలపించారు. తమన్ అందించిన మ్యూజిక్ తో థియేటర్ల బాక్సులు బద్దలయ్యేలా ఈ పాట గూస్ బంప్స్ అనేలా కొనసాగింది.
అఖండ సినిమాకు సీక్వెల్ గా ఆఖండ 2 తాండం మూవీ వస్తుంది. బాలకృష్ణ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేశారు. సంయుక్త మేనన్ హీరోయిన్. హర్షాలి మల్హోత్రా మరో కీలక పాత్రలో కనిపించనుంది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానున్న చిత్రబృందం ప్రచారం జోరు పెంచింది. ఫస్ట్‌లుక్, టీజర్‌కు, ఫస్ట్ సింగిల్ గా వచ్చిన తాండవం సాంగ్ కు అపూర్వమైన రెస్పాన్స్ రావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో హైప్ పెరిగింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram