Cinema Tree| సినిమా చెట్టు..గోదావరి గట్టున మళ్లీ చిగురించింది!

అమరావతి : ఆంధ్రప్రదేశ్(Andhra pradesh)లోని తూర్పు గోదావరి జిల్లా (East Godavari) కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామం(kumaradevam village)గోదావరి తీరంలో ఉన్న ‘సినిమా చెట్టు(Cinema Tree) మళ్లీ జీవం(Revival project) పోసుకుంది. గోదావరి గట్టు(Godavari Gattu)న అందమైన ప్రకృతి ఒడిలో కొలువైన ఈ చెట్టు గతంలో 300కి పైగా చిత్రాలలో కనిపించి తెలుగు సినీ అభిమానుల(Telugu Cinema Iconic Spots)మదిలో చిరస్థాయిగా నిలిచింది. అయితే గత ఏడాది గోదావరి వరదల సమయంలో ఈ మహా వృక్షం రెండుగా చీలి కూలిపోయింది. కూలిపోయిన చెట్టును చూసి అభిమానులు, స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చెట్టును రక్షించాలని విజ్ఞప్తులు చేశారు. ఈ క్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి (Rajahmundry Rotary Club).. ఐకాన్స్ ఆధ్వర్యంలో గ్రీన్ భారత్ – వనం మనం (Vana Manam Green India)విభాగం ప్రత్యేక ప్రాజెక్టును ప్రారంభించి సినిమా చెట్టును పునరుజ్జీవం చేసే ప్రక్రియ నిర్వహణకు ముందుకొచ్చింది.
ప్రాజెక్టు నిర్వాహకులు కూలిపోయిన చెట్టు మొదలుకు రసాయనాలతో దీర్ఘకాల చికిత్స అందించారు. వారి ప్రయత్నం ఫలించి సినిమా చెట్టు పునరుజ్జీవం పోసుకుంది. వేరు మధ్యలో కొత్త అంకురం పుట్టుకొచ్చి క్రమంగా చిగుళ్లు తొడిగి ప్రస్తుతం10 అడుగుల మొక్కగా ఎదిగింది. మరో ఏడాది కాలంలో ఈ మొక్క పెద్దదై గోదావరి గట్టున తన సినిమా చెట్టు వైభవాన్ని మళ్లీ సాక్ష్యాత్కరింపచేస్తుందని నిర్వహకులు ధీమా వ్యక్తం చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో సినిమాల సన్నివేశాల్లో ఆకట్టుకున్న గోదవారి గట్టు సినిమా చెట్టు మళ్లీ పునర్జీవం పొందడం పట్ల సినీ అభిమానులు. పర్యావరణ ప్రియులు, స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.