Andhra King Taluka : ‘ఆంధ్ర కింగ్‌ తాలూకా’ మూవీ ‘ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’ సాంగ్‌ ప్రోమో విడుదల

రామ్ పోతినేని, భాగ్యశ్రీ జంటగా నటించిన ‘ఆంధ్ర కింగ్‌ తాలూకా’ సినిమా నుంచి ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సాంగ్‌ ప్రోమో విడుదలైంది. పూర్తి పాట రేపు విడుదల.

Andhra King Taluka : ‘ఆంధ్ర కింగ్‌ తాలూకా’ మూవీ ‘ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’ సాంగ్‌ ప్రోమో విడుదల

విధాత: హీరో రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన ‘ఆంధ్ర కింగ్‌ తాలూకా’సినిమా నుంచి మేకర్స్ మంగళవారం ‘ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’ సాంగ్‌ ప్రోమో విడుదల చేశారు. టైటిల్ సాంగ్ మాదిరిగా కనిపిస్తున్న ఈ పాటలో సినిమాలో తన అభిమాన హీరో నటించిన సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్ ముందు హీరో రామ్ పొతినేని బృందం కాగితం ముక్కలు విసురుతూ..డ్యాన్స్ తో చేసిన హడావుడి ఆకట్టుకునేలా కనిపించింది.

పూర్తి సాంగ్ బుధవారం రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. దర్శకుడు పి. మహేశ్‌బాబు తెరకెక్కించిన ఈ సినిమాలో కన్నడ నటుడు ఉపేంద్ర(ఆంధ్రాకింగ్) వీరాభిమానిగా రామ్‌ నటించారు. సినీ అభిమాని బయోపిక్‌గా రూపొందిన ఈ సినిమా ఈ నెల 28న ప్రేక్షకులకు మందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది.