Aashrita|ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం ఖ‌మ్మం వ‌చ్చిన వెంక‌టేష్ కూతురు.. ఎవ‌రి కోసం అంటే..!

Aashrita| ప్ర‌స్తుతం ఎన్నిక‌ల హీట్ మాములుగా లేదు. ఒక‌వైపు భానుడి భ‌గ‌భ‌గ‌లు మ‌రోవైపు రాజకీయాల వేడి ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేస్తుంది. తెలంగాణ‌, ఏపీలో కూడా రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది. తెలంగాణ‌లో లోక్ స‌భ ఎన్నిక‌లు మే 13న జ‌ర‌గ‌నుండ‌గా, ఈ ఎన్నిక‌ల కోసం రాజకీయ నాయ‌కులు జోరు

  • By: sn    cinema    May 02, 2024 8:42 AM IST
Aashrita|ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం ఖ‌మ్మం వ‌చ్చిన వెంక‌టేష్ కూతురు.. ఎవ‌రి కోసం అంటే..!

Aashrita| ప్ర‌స్తుతం ఎన్నిక‌ల హీట్ మాములుగా లేదు. ఒక‌వైపు భానుడి భ‌గ‌భ‌గ‌లు మ‌రోవైపు రాజకీయాల వేడి ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేస్తుంది. తెలంగాణ‌, ఏపీలో కూడా రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది. తెలంగాణ‌లో లోక్ స‌భ ఎన్నిక‌లు మే 13న జ‌ర‌గ‌నుండ‌గా, ఈ ఎన్నిక‌ల కోసం రాజకీయ నాయ‌కులు జోరున ప్ర‌చార కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. నిత్యం రోడ్​ షోలు, భారీ బహిరంగ సభలతో ప్రజల్లోకి వెళ్లి త‌మ పార్టీని గెలిపించాల‌ని కోరుతున్నారు. ఇక రాజ‌కీయ నాయ‌కుల‌కి తోడుగా ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సైతం ప్ర‌చారం చేస్తూ హీటెక్కిస్తున్నారు. తాజాగా విక్టరీ వెంకటేశ్ పెద్ద కూతురు కూడా పొలిటికల్ క్యాంపెయిన్ చేయడం ఆస‌క్తిని రేకెత్తించింది.

ఖమ్మం పార్లమెంట్ స్థానానికి నామా నాగేశ్వ‌ర‌రావుకి పోటీగా కాంగ్రెస్ పార్టీ నుండి రామసహాయం రఘురాంరెడ్డి నిల‌బ‌డ్డారు. ఆయ‌న తరుపున ప్రచారం కోసం అనూహ్యంగా హీరో విక్టరీ వెంకటేష్ పెద్ద కూతురు అశ్రిత ఎన్నికల ప్రచారంలోకి దిగారు. తన మామయ్య రఘురామ రెడ్డి కోసం ఆమె క్యాంపెయిన్ నిర్వహించారు.వెంక‌టేష్ వ‌చ్చి ప్ర‌చారం చేస్తార‌ని అంద‌రు అనుకున్నారు. కాని ఆయ‌న పెద్ద కూతురు ఆశ్రిత ఖ‌మ్మంలో జ‌రిగిన మీటింగ్‌లో పాల్గొని ప్ర‌చారం చేసింది. కాంగ్రెస్ పార్టీ కండువా క‌ప్పుకొని ఆమె ర‌ఘురామ రెడ్డిని గెలిపించాల‌ని కోరింది. ప్రస్తుతం ఆశ్రిత ఎన్నికల ప్రచార వీడియో నెట్టింట వైరలవుతుంది. ఇక ఖ‌మ్మం లోక్ స‌భ స్థానం నుండి బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు, బీజేపీ నుంచి తాండ్ర వినోద్​రావు పోటీ చేస్తున్నారు.

రామసహాయం రఘురామ రెడ్డి మ‌రెవ‌రో కాదు. కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, హీరో వెంకటేశ్ వియ్యంకుడు. ఆయ‌న‌ని గెలిపించేందుకు ఒక‌వైపు పొంగులేటి మ‌రోవైపు వెంక‌టేష్ ఫ్యామిలీ రంగంలోకి దిగ‌డం విశేషం. చూస్తుంటే మ‌రి కొద్ది రోజుల‌లో వెంక‌టేష్ కూడా ఇక్క‌డికి వ‌చ్చి ప్ర‌చారం చేసేలా ఉన్నారు. ఆశ్రిత మాత్రం ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌లో చాలా యాక్టివ్‌గా క‌నిపించారు.