Chiranjeevi Files Complaint Over Deepfake | ఫేక్ పోస్టులపై మరోసారి పోలీసులకు చిరంజీవి ఫిర్యాదు

ఫేక్ పోస్టులపై మరోసారి పోలీసులను ఆశ్రయించిన చిరంజీవి. తన పేరును, ఫోటోను అనుమతి లేకుండా వినియోగిస్తున్నారని ఫిర్యాదు.

Chiranjeevi Files Complaint Over Deepfake | ఫేక్ పోస్టులపై మరోసారి పోలీసులకు చిరంజీవి ఫిర్యాదు

విధాత : ఫేక్ పోస్టులపై మరోసారి మెగాస్టార్ చిరంజీవి పోలీసులను ఆశ్రయించారు. తనపై ఎక్స్‌ (ట్విటర్‌)లో అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారంటూ దయా చౌదరి అనే వ్యక్తిపై చిరంజీవి ఫిర్యాదు చేశారు. ఇటీవల హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ఇంకా ఇలాంటి పోస్ట్‌లు పెడుతున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలని చిరంజీవి తన ఫిర్యాదులో కోరారు. ఆయన ఫిర్యాదు ఆధారంగా సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

తన పేరు, ఫొటో, వాయిస్‌లను అనుమతి లేకుండా ఉపయోగించుకుంటున్నారంటూ ఇటీవల చిరంజీవి సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆయన అనుమతి లేకుండా ఉపయోగించడానికి వీల్లేదంటూ హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. టీఆర్పీ, లాభాల కోసం చిరంజీవి పేరును దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఎట్టి పరిస్థితుల్లో చిరంజీవి పేరును వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించవద్దని హెచ్చరించింది. కోర్టు ఆదేశాల అనంతరం కూడా తన పేరు, ఫోటోలను దుర్వినియోగం చేస్తూ ఫేక్ పోస్టులు పెడుతుండటంతో చిరంజీవి మరోసారి పోలీసులను ఆశ్రయించారు.