Viral Video | దిగ్భ్రాంతికర ఘటన.. మూడేళ్ల చిన్నారిపైకి కారు పోనిచ్చిన బాలుడు.. కట్ చేస్తే..
అహ్మదాబాద్‌లో మూడేళ్ల బాలిక రోడ్డు ప్రమాదం నుంచి అనూహ్యంగా తప్పించుకుంది. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Viral Video | మైనర్‌లు వాహనాలు నడపడం నేరం. కానీ.. చాలా మంది పిల్లలు అది పట్టించుకోకుండా కార్లు, బైకులు నడుపుతూ ఉంటారు. కంగారులో యాక్సిడెంట్ చేస్తుంటారు. ఆ సమయాల్లో వారి తల్లిదండ్రులకే కాకుండా.. బాధితులకు కూడా ఇబ్బందే. చాలా ఘటనల్లో ఇది రుజువవుతున్నా.. బైకు నడిపే పిల్లల్లో మార్పు రావడం లేదు. ఇలాంటి ఒక దిగ్భ్రాంతికర ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటు చేసుకున్నది. ఒక బాలుడు.. కారులో వస్తూ మూడేళ్ల చిన్నారి మీదుగా కారు పోనిచ్చాడు. ఈ ఘటన అక్టోబర్ 29, 2025న (బుధవారం) చోటు చేసుకుంది. సీసీ టీవీలో రికార్డయిన ఈ ఘటన వైరల్‌గా మారింది. శివ్ బంగ్లాస్ సమీపంలో ఇది జరిగింది. ఒక మూడేళ్ల చిన్నారి ఆడుకుంటూ ఇంటి నుంచి బయటకు రావడం వీడియోలో కనిపిస్తుంది.
రోడ్డు మలుపు వద్ద నిలబడి ఉన్న సమయంలో ఒక బాలుడు బ్లూకర్ కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు. మలుపు దగ్గర బాలిక నిలబడి ఉన్న విషయాన్ని గమనించకుండా ఆమె మీదుగా కారు పోనిచ్చాడు. కొన్నిమీటర్లు వెళ్లిన తర్వాత కారు ఆపి కిందకు దిగాడు. ఆ సమయంలో కారు కింద నుంచి అనూహ్యంగా బాలిక పాకుకుంటూ బయటకు వచ్చి.. నడుస్తూ తన ఇంటి ముందుకు వెళ్లింది. ఈ సమయంలో కారు నడుపుతున్న బాలుడు కూడా ఆ పాపను సముదాయించడం కనిపించింది. ఈ సమయంలో గలాభా జరగడంతో చుట్టుపక్కలవారు ఇండ్ల నుంచి బయటకు వచ్చారు. ఆ సమయంలో బహుశా ఆ బాలిక తల్లిగా భావిస్తున్న మహిళ.. బాలుడి చెంప ఛెళ్లుమనిపించింది. మైనర్ నడుపుతున్న ఆ కారుకు నంబర్ ప్లేట్ కూడా లేదు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు జరుగుతన్నది. ఈ కారు ఓనర్‌పై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
ఈ వీడియోను చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. పిల్లలకు కారు ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు. తల్లిదండ్రులు గారాబం చేయడం వల్లే పిల్లలు బైక్‌లు, కార్లు నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram