Comedian| ఆ క‌మెడీయ‌న్ ఇంట్లో జ‌రిగిన దొంగ‌త‌నం.. దొంగ ఎవ‌రో తెలిసి అంద‌రు షాక్..!

Comedian|  ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా కూడా సెల‌బ్రిటీల ఇళ్ల‌లో దొంగ‌త‌నాలు జ‌రుగుతుండ‌డం ఇటీవ‌ల కామ‌న్ అయింది. కొద్ది రోజుల క్రితం మోహ‌న్ బాబు ఇంట్లో దొంగ‌త‌నం జ‌ర‌గ‌డం సంచ‌ల‌నం రేపింది. ఇక ఇప్పుడు క‌మెడీయ‌న్ ఇంట్లో న‌గ‌ల దొంగ‌త‌నం జ‌రగడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్రముఖ హాస్యనటుడు కరుణాకరన్ ఇంట్లో 60 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురి కాగా, ఈ కేసులో ప‌ని మ‌నిషిని అరెస్ట్ చేశారు.క

  • By: sn    cinema    Oct 16, 2024 9:10 PM IST
Comedian| ఆ క‌మెడీయ‌న్ ఇంట్లో జ‌రిగిన దొంగ‌త‌నం.. దొంగ ఎవ‌రో తెలిసి అంద‌రు షాక్..!

Comedian|  ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా కూడా సెల‌బ్రిటీల ఇళ్ల‌లో దొంగ‌త‌నాలు జ‌రుగుతుండ‌డం ఇటీవ‌ల కామ‌న్ అయింది. కొద్ది రోజుల క్రితం మోహ‌న్ బాబు(Mohan Babu) ఇంట్లో దొంగ‌త‌నం జ‌ర‌గ‌డం సంచ‌ల‌నం రేపింది. ఇక ఇప్పుడు క‌మెడీయ‌న్ ఇంట్లో న‌గ‌ల దొంగ‌త‌నం జ‌రగడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్రముఖ హాస్యనటుడు కరుణాకరన్ ఇంట్లో 60 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురి కాగా, ఈ కేసులో ప‌ని మ‌నిషిని అరెస్ట్ చేశారు.కరుణాకరన్(Karunakaran) ప్ర‌స్తుతం తన కుటుంబంతో చెన్నైలోని ఓఎంఆర్ రోడ్డులో ఉన్న కరపాక్కం ప్రాంతంలో నివసిస్తున్నారు. ఇటీవల ఆయన ఇంట్లోని బీరువాలో 60 తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురి కావ‌డంతో ఆయ‌న భార్య తేరల్ చెన్నై కన్నగి నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

కరుణాక‌ర‌న్ భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కన్నగి నగర్ పోలీసులు కేసు నమోదు చేసి ముమ్మరంగా దర్యాప్తు చేశారు. అలాగే కరుణాకరన్ ఇంటిని తనిఖీ చేయగా నగలు ఉంచిన బీరువా పగలకుండా కనిపించింది. అలాగే ఇంటి తాళం పగలకపోవడంతో బయటి వ్యక్తులు చోరీకి పాల్పడలేదని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కరుణాకరన్(Karunakaran) ఇంట్లో పనిచేసే వ్యక్తులు, సెక్యూరిటీ గార్డులతో సహా అందరినీ విచారించగా, ఎవరూ దొంగతనం చేయలేదని చెప్పారు.సిసిటివి కెమెరా(CC Camera)ల్లో కూడా ఎవరూ అనుమానాస్పదంగా కనిపించకపోవడంతో.. ఇంట్లో పనిచేసే వారి వేలిముద్రలను పోలీసులు సేకరించి పరిశీలించ‌డంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

కరుణాకరన్ ఇంట్లో పనిచేస్తున్న విజయ అనే మహిళ బీరువా పగలగొట్టి 60 సవర్ల‌ నగలను దొంగిలించినట్లు తేలింది. ఆమె వేలిముద్రలు దొంగ‌త‌నం చేసిన‌ట్టు నిర్దారించాయి. ఈ క్ర‌మంలో ప‌నిమ‌నిషిని పోలీసులు అరెస్టు చేసి, ఈ దొంగతనం వెనుక ఎవరెవరున్నారనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. కరుణాకరన్ తమిళ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా అలరిస్తున్నాడు. చిన్న చిన్న సినిమాల నుంచి మొదలు పెట్టి స్టార్ హీరోల సినిమాలలోను క‌మెడీయ‌న్‌గా క‌నిపించి అల‌రించాడు కరుణాకరన్. 100కు పైగా తమిళ చిత్రాల్లో హాస్య పాత్రల్లో నటించారు. దర్శకుడు సుందర్ సి దర్శకత్వం వహించిన ‘కలకలప్పు’ చిత్రంతో ఆయన నటుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఆయన నటించిన సూదు కవ్వం, జిగర్తాండ, ఇరైవి, పిజ్జా, ఒరు నాల్ కూత్తు, తీయ వేలై సెయ్యనుమ్ కుమారు, అయలాన్ వంటి చిత్రాలు మంచి ఆదరణ పొందాయి