Akhanda 2|గ్రాండ్‌గా లాంచ్ అయిన అఖండ2.. పూజా కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్‌గా బాలయ్య కుమార్తెలు
Akhanda 2| నందమూరి బాలకృష్ణ స్పీడ్ ఇప్పుడు మాములుగా లేదు. ఆయన పని అయిపోయింది అనుకున్న సమయంలో మళ్లీ పైకి లేచి వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నారు. బోయపాటి సినిమాతోనే బాలయ్య మళ్లీ పుంజుకున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ అంటే సినిమా హిట్ అయి తీరాల్సిందే. బాల

Akhanda 2| నందమూరి బాలకృష్ణ(Bala Krishna) స్పీడ్ ఇప్పుడు మాములుగా లేదు. ఆయన పని అయిపోయింది అనుకున్న సమయంలో మళ్లీ పైకి లేచి వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నారు. బోయపాటి (Boyapati Srinu)సినిమాతోనే బాలయ్య మళ్లీ పుంజుకున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ అంటే సినిమా హిట్ అయి తీరాల్సిందే. బాలకృష్ణ, బోయపాటి కలయికలో వచ్చిన సింహా తిరుగులేని విజయాన్ని సాధించి వసూళ్ల వర్షం కురిపించింది. ఆ తర్వాత వరుసగా లెజెండ్, అఖండ(Akhanda) చిత్రాలతో ఘన విజయంతో హ్యాట్రిక్ కొట్టిన బాలయ్య – బోయపాటి కాంబో ఇప్పుడు మరో సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యారు.అఖండ 2 చిత్రంతో ప్రేక్షకులని అలరించబోతున్నారు.
గ్రాండ్ లాంచింగ్..
చివరిగా వచ్చిన అఖండ చిత్రంలో అఘోరాగా, మురళీకృష్ణగా ఇరగదీశారు బాలకృష్ణ. ముఖ్యంగా అఖండగా ఆయన నట విశ్వరూపం చూపించి అదరహో అనిపించారు. ఇక చిత్రానికి థమన్(SS Thaman) అందించిన బీజీఎంతో బాక్స్‌లు బద్ధలయ్యాయి. లాంగ్ రన్‌లో రూ.150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను పంచిపెట్టిన ఈ చిత్రం బాలకృష్ణ కెరీర్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది.ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్‌గా అఖండ 2 (Akhanda2)రూపొందుతుంది. ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో అట్టహాసంగా జరగగా, ఈ కార్యక్రమానికి మూవీ టీమ్‌తో పాటు బాలయ్య కుమార్తెలు నారా బ్రాహ్మణి, తేజస్విని సహా ఇతర కుటుంబసభ్యులు హాజరై సందడి చేశారు.
నారా బ్రాహ్మణి క్లాప్ కొట్టగా, బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్‌తో అదరగొట్టేశారు. ఇక మూవీ టీమ్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇకపోతే సినిమాను గ్రాండ్‌గా లాంఛ్ చేసిన కాసేపటికే అఖండ 2 టైటిల్ థీమ్‌ను కూడా రిలీజ్ చేస్తూ ఓ వీడియోను వదిలారు మేకర్స్. ఈ టైటిల్ థీమ్‌కు మ్యూజిక్ సెన్సేషన్ తమన్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడంతో అంచనాలు పీక్స్‌కి వెళ్లాయి. అఖండ 2 టైటిల్‌కు తాండవం అనే క్యాప్షన్ ఇచ్చారు. దానికి తగ్గట్టు తమన్ తాండవం చూపించేలా ఉన్నాడని అందరు ముచ్చటించుకుంటున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై గోపీ అచంట, రామ్ అచంట సంయుక్తగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. బాలకృష్ణ చిన్న కుమార్తె నందమూరి తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు.