Akhanda 2 | జార్జియాకు.. ఆఖండ 2 చిత్ర బృందం!

  • By: sr    latest    Apr 25, 2025 6:26 PM IST
Akhanda 2 | జార్జియాకు.. ఆఖండ 2 చిత్ర బృందం!

Akhanda 2 |

విధాత: నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ భారీ విజయం తర్వాత సీక్వేల్ అఖండ 2: తాండవం సినిమాపై బాలయ్య అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరుగుతున్నాయి. బాలయ్య, బోయపాటి కాంబోలో రాబోతున్న నాల్గవ చిత్రం ఆఖండ 2 తాండవం. ఈ మూవీ సగం చిత్రీకరణ పూర్తిచేసిన బోయపాటి తదుపరి షెడ్యూల్ కోసం లొకేషన్ల వేటలో పడ్డారు. ఇందుకు సంబంధించి తాజాగా కీలక ఆప్డేట్ వెల్లడైంది.

జార్జియాలో లాంగ్ షెడ్యూల్

నెల రోజుల షెడ్యూల్ కోసం ఈ చిత్ర బృందం వచ్చే నెల జార్జియా వెళ్తున్నట్లు సమాచారం. మే 2 నుంచి జార్జియా షెడ్యూల్ మొదలు కానుంది. బాలకృష్ణ, ఇతర ప్రధాన నటులకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి జార్జియాలో అద్భుతమైన లొకేషన్స్ కోసం అన్వేషిస్తున్నారట డైరెక్టర్ బోయపాటి.

‘గౌతమిపుత్ర శాతకర్ణి’ తర్వాత మరోసారి బాలయ్య సినిమా షూటింగ్ జార్జియాలో జరుగుతోంది. ఇప్పటికే జరిగిన చిత్రీకరణలో ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళలో తీసిన సీన్లు సినిమాలో గూస్ బంప్స్ తెప్పించేదిగా ఉంటాయని టాక్ వినిపిస్తుంది. ఇక జార్జియాలో చిత్రికరించే సీన్లు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారడంతో ఇది సినిమాపై మరింత క్రేజ్ పెంచుతుంది.