Akkineni Amala | ఇంత‌లా దిగ‌జార‌డం సిగ్గుచేటు.. కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై అక్కినేని అమ‌ల ఫైర్

Akkineni Amala | టాలీవుడ్ హీరో నాగార్జున‌( Nagarjuna )పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన కొండా సురేఖ‌( Konda Surekha )పై అక్కినేని అమ‌ల( Akkineni Amala ) స్పందించారు. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ఇంత‌లా దిగ‌జారి మాట్లాడ‌డం సిగ్గుచేటు అని సురేఖ‌పై అమ‌ల మండిప‌డ్డారు.

  • By: raj    cinema    Oct 02, 2024 10:18 PM IST
Akkineni Amala | ఇంత‌లా దిగ‌జార‌డం సిగ్గుచేటు.. కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై అక్కినేని అమ‌ల ఫైర్

Akkineni Amala | త‌మ కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ( Konda Surekha ) చేసిన వ్యాఖ్య‌ల‌పై అక్కినేని అమ‌ల( Akkineni Amala  )తీవ్రంగా స్పందించారు. ఒక మంత్రి అయి ఉండి సురేఖ అలా మాట్లాడడం దారుణ‌మ‌న్నారు. రాజ‌కీయాల( Politics ) కోసం అలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం సిగ్గుచేటు అని అమ‌ల ఎక్స్ వేదిక‌గా ట్వీట్ చేశారు.

కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై అక్కినేని అమ‌ల స్పంద‌న ఇదే..

ఒక మ‌హిళా మంత్రి క‌ల్పిత ఆరోప‌ణ‌లు చేస్తూ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం కొంద‌ర్ని ల‌క్ష్యంగా చేసుకోని మాట్లాడ‌డం దిగ్భ్రాంతిక‌రం. నా భ‌ర్త గురించి త‌ప్పుడు క‌థ‌నాలు చెబుతున్న ఇలాంటి వ్య‌క్తుల‌ను న‌మ్ముతున్నారా..? ఇది నిజంగా సిగ్గుచేటు. నేత‌లు ఇంత‌లా దిగ‌జారి ప్ర‌వ‌ర్తిస్తే మ‌న దేశం ఏమ‌వుతుంది..? రాహుల్ గాంధీ గారూ.. మీరు వ్య‌క్తుల గౌర‌వ మ‌ర్యాద‌ల‌ను న‌మ్మిన‌ట్లు అయితే.. ద‌య‌చేసి మీ నేత‌ల‌ను అదుపులో ఉంచుకోండి. ఆ మ‌హిళా మంత్రి నా కుటుంబానికి క్ష‌మాప‌ణ‌లు చెప్పి, త‌న వ్యాఖ్య‌ల‌ను ఉప‌సంహ‌రించుకునేలా చ‌ర్య‌లు తీసుకోండి. ఈ దేశ పౌరుల‌ను ర‌క్షించండి.. అని అమ‌ల త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.