Allu Arjun|అల్లు అర్జున్‌ని కలిసేందుకు 1600 కి.మీ సైకిల్ తొక్కుకుంటూ వ‌చ్చిన యూపీ అభిమాని

Allu Arjun|స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్‌గా మారిన అల్లు అర్జున్( Allu Arjun) పుష్ప సినిమాతో దేశ వ్యాప్తంగా అభిమానుల‌ని సంపాదించుకున్నాడు. పుష్ప(Pushpa) చిత్రంతో బ‌న్నీ క్రేజ్ అమాంతం పెరిగింది. దేశం న‌లువైపులా ఆయ‌నకి విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. పుష్ప చిత్రం

  • By: sn    cinema    Oct 16, 2024 4:45 PM IST
Allu Arjun|అల్లు అర్జున్‌ని కలిసేందుకు 1600 కి.మీ సైకిల్ తొక్కుకుంటూ వ‌చ్చిన యూపీ అభిమాని

Allu Arjun|స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్‌గా మారిన అల్లు అర్జున్( Allu Arjun) పుష్ప సినిమాతో దేశ వ్యాప్తంగా అభిమానుల‌ని సంపాదించుకున్నాడు. పుష్ప(Pushpa) చిత్రంతో బ‌న్నీ క్రేజ్ అమాంతం పెరిగింది. దేశం న‌లువైపులా ఆయ‌నకి విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ స్వాగ్, మేనరిజమ్స్, మాస్ యాక్షన్, డ్యాన్స్, స్టైల్‍ ప్ర‌తి ఒక్క‌రికి తెగ న‌చ్చేశాయి. దీంతో పుష్ప‌2పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు పుష్ప సినిమాతో ఆయ‌న క్రేజ్ దేశ వ్యాప్తంగా పెర‌గ‌డం విశేషం.ఈ నేప‌థ్యంలో యూపీకి చెందిన అభిమాని(Fan) అల్లు అర్జున్‍ను కలిసేందుకు ఏకంగా 1,600 కిలోమీటర్లు సైకిల్ తొక్కాడు.

త‌న అభిమాన న‌టుడు అయిన అల్లు అర్జున్‍ను కలిసేందుకు ఉత్తర ప్రదేశ్‍లోని అలీగఢ్ నుంచి సైకిల్‍పై హైదరాబాద్‍(Hyderabad)కు వచ్చారు ఓ అభిమాని. ఏకంగా 1,600 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ వ‌చ్చిన అభిమాని అక్టోబర్ 16 హైద‌రాబాద్‌లో అల్లు అర్జున్‍(Allu Arjun)ను కలిశారు. ఆ స‌మ‌యంలో అభిమాని ఆనందం అవ‌ధులు దాటింది. ఇక అల్లు అర్జున్ కూడా త‌న అభిమానిని ఎంతో ఆప్యాయంగా ప‌ల‌క‌రించారు. ఎలా వచ్చావని అడిగితే.. సైకిల్‍పై అని చెప్పారు. దీంతో అల్లు అర్జున్ ఆశ్చర్యపోయారు. వెంట‌నే త‌న టీంకి ఆ అభిమానిని జాగ్రత్తగా తిరిగి పంపాలని చెప్పారు. ట్రైన్‍, ఫ్లైట్ ఏదో ఒకటి బుక్‍ చేసి అతడిని ఇంటికి తిరిగి పంపాలని ఆదేశించారు. సైకిల్‍పై వెళ్లవద్దని అతడితో చెప్పారు.

పుష్ప 2 ప్రమోషన్లకు ఉత్తర్ ప్రదేశ్(uttarpradesh) వస్తే త‌ప్ప‌క‌ కలుస్తానని ఆ అభిమానితో అల్లు అర్జున్ చెప్ప‌డం కొస మెరుపు. ఇక ఆ అభిమాని తాను డైహార్ట్ ఫ్యాన్ అని చెప్పుకోగా, ఓ మొక్కను అతడికి అందించారు అల్లు అర్జున్. అతడికి కొన్ని డబ్బులు కూడా ఇవ్వాలని, జాగ్రత్తగా పంపించాలని అక్కడి వారికి సూచించారు. చివర్లో జుకేగా నై (తగ్గేదే లే) అంటూ పుష్ప డైలాగ్ చెప్పారు ఆ ఫ్యాన్. అభిమాని విష‌యంలో బ‌న్నీ అంత జాగ్ర‌త్త తీసుకోవ‌డం ప‌ట్ల నెటిజ‌న్స్ హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. కాగా, బ‌న్నీ న‌టిస్తున్న పుష్ప 2 చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 6న రిలీజ్ చేస్తామని మూవీ టీమ్ ప్రకటించింది. అయితే, అందుకు ఒకరోజు ముందుగానే డిసెంబర్ 5నే విడుదల చేసేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది.