నన్ను వాడుకొని వదిలేస్తే ఫ్లాప్ కాక ఏమవుతుంది.. ఫ్యామిలీ స్టార్‌పై నటి సంచలన కామెంట్స్

‘గీత గోవిందం’ లాంటి బ్లాక్ బస్టర్ కాంబో తర్వాత విజయ్ దేవరకొండ, పరశురాం కలిసి చేసిన చిత్రం ఫ్యామిలీ స్టార్. ఇందులో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించగా దిల్ రాజు నిర్మాతగా ఉన్నారు. ఈ మూవీకి సంబంధించి జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. మూవీ మొదలైనపుడు ఇది కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందనే అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఈ ముగ్గురి నుంచి ఆశించే సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ కాదని తొలి రోజే తెలిపోయింది. యుఎస్ ప్రిమియర్స్ నుంచే సినిమాకి బ్యాడ్ టాక్ మొదలు కాగా, తెలుగు రాష్ట్రాలలో కూడా నెగెటివ్ టాక్ వచ్చింది. ఇక సోషల్ మీడియాలో మరింత నెగెటివిటీ నడిచింది. లైగర్ సినిమాకి, ఫ్యామిలీ స్టార్‌కి తేడా ఏమి లేదనే కామెంట్స్ వినిపించాయి.
అయితే ఫ్యామిలీ స్టార్‌కి కొంత ఊరటనిచ్చే అంశం ఏంటంటే.. మార్నింగ్ షోలకు ఉన్న ఆక్యుపెన్సీలు చాలా థియేటర్లలో తర్వాతి షోలకు కూడా కొనసాగినట్లు బుకింగ్స్‌ను బట్టి అర్థమవుతోంది. విజయ్ క్రేజా లేకుంటే వేసవి సెలవుల ఎఫెక్టా అనేది తెలియదు కాని తొలి రోజు ఈవెనింగ్, నైట్ షోలకు మంచి ఆక్యుపెన్సీ కనిపించింది. వారాంతం ఇలానే ఉంటుందా లేదా అనేది చూడాలి. ఇక మూవీకి తొలి రోజు ఆంధ్రా, తెలంగాణలో రూ. 3.85 కోట్లు షేర్‌ను వసూలు చేసి సత్తా చాటింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 40 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.05 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే మొదటి రోజు ఈ చిత్రానికి రూ. 6.30 కోట్లు షేర్‌తో పాటు రూ. 11.20 కోట్లు గ్రాస్ వచ్చింది. అయితే తాజాగా ఓ నటి సినిమా యూనిట్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది.
నా లాంటి దానికి అన్యాయం చేసారు కాబట్టే ఫ్యామిలీ స్టాక్ అట్టర్ ప్లాప్ అయ్యిందని అంటుంది. ఆమె ఎవరో కాదు ఆషా బొర్రా.. తన ఇద్దరు కూతుర్లతో సోషల్ మీడియాలో చేసే సందడి మాములుగా ఉండదు. ఈ క్రమంలోనే ఫేమస్ అయిన ఆమె ఫ్యామిలీ స్టార్‌లో అవకాశం దక్కించుకుంది. అయితే ఇప్పుడు ఆమె మూవీ యూనిట్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తుంది. నన్ను స్టఫ్ మాదిరిగా వాడుకొని వదిలేస్తే సినిమా ఫ్లాప్ కాకుండా ఏమవుతుంది. ఇదేదో గొప్ప సినిమా అయినట్టు డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గరనుంచి కాస్టింగ్ డైరెక్టర్ వరకు ఒకటే ఫోన్లు చేశారు. హెల్త్ బాగోకపోయినా యూనిట్ కి ఇచ్చిన ఒక్క మాట కోసం యాంటి బయోటిక్ టాబ్లెట్స్ వేసుకొని నటించాను. టైమ్ వేస్ట్ తప్ప ఏం లేదు. స్తామన్న రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదు కదా,హోటల్ స్టే డబ్బులు కూడా నేనే కట్టుకున్నా. కనీసం ట్రావెల్ ఖర్చులు కూడా ఇవ్వలేదు. కనీసం విజయ్ దేవరకొండ కాంబో సీన్స్ సినిమాలో ఉంచిన అవన్నీ మరచిపోయేదాన్ని. మీ ఎడిటింగ్‌కి పెద్ద దండం. ఇలా జరగడానికి కారణం అయిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అంటూ ఆమె తన పోస్ట్‌లో రాసుకొచ్చింది.