Bala Krishna| బాల‌య్య చేయి చేసుకోవ‌డం వెన‌క కార‌ణం ఇదే.. అస‌లు మేట‌ర్ చెప్పిన పూరీ జ‌గ‌న్నాథ్

Bala Krishna| దివంగ‌త న‌టుడు ఎన్టీఆర్ వార‌సుడిగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నంద‌మూరి బాల‌కృష్ణ తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అని నిరూపించుకున్నాడు. అనేక

  • By: sn    cinema    Jul 12, 2024 5:08 PM IST
Bala Krishna| బాల‌య్య చేయి చేసుకోవ‌డం వెన‌క కార‌ణం ఇదే.. అస‌లు మేట‌ర్ చెప్పిన పూరీ జ‌గ‌న్నాథ్

Bala Krishna| దివంగ‌త న‌టుడు ఎన్టీఆర్ వార‌సుడిగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నంద‌మూరి బాల‌కృష్ణ తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అని నిరూపించుకున్నాడు. అనేక పాత్ర‌ల‌లో న‌టిస్తూ మెప్పించారు. ఇప్పటికీ కుర్ర హీరోల‌కి పోటీగా సినిమాలు చేస్తూ ఆడియ‌న్స్‌ని మెప్పిస్తున్నారు. ఇటీవ‌ల బాల‌య్య రాజ‌కీయాల‌లో హ్యాట్రిక్ విజ‌యాన్ని అందుకున్నారు. హిందూపూర్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక వరుసగా 3 సినిమాలు హిట్ కొట్టి హ్యాట్రిక్ హీరో అనిపించుకొని ప్రస్తుతం మెగా డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ త‌రువాత బోయపాటి శ్రీను డైరెక్షన్ లో అఖండ2 సినిమాను పట్టాలెక్కించబోతున్నారు.

అయితే బాల‌య్య త‌న ఫ్యాన్స్‌పై చేయి చేసుకుంటాడు అనే అపనింద ఉన్న విష‌యం మ‌నకు తెలిసిందే. ఎవ‌రైన కాస్త తేడాగా ప్ర‌వ‌ర్తిస్తే బాల‌య్య చేయి అవ‌త‌లి వారి చెంపై ఉంటుంది. అస‌లు బాలయ్య తన ఫ్యాన్స్ ను ఎందుకు కొడతాడు అనే దానిపై పూరీ జ‌గ‌న్నాథ్ వివ‌ర‌ణ ఇచ్చాడు. సాధార‌ణంఆ సెలబ్రిటీలు అంటే క్రేజ్ బాగా ఉంటుంది. వారి కోసం ఎగ‌బ‌డి చూసే ప్ర‌య‌త్నం చేస్తారు. మీద కూడా ప‌డుతుంటారు. సెల‌బ్రిటీల‌ని ముట్టుకోవాల‌నే ఆశ కూడా ఉంటుంది. అయితే అది క‌రెక్టా, కాదా అని ఎవ‌రు ఆలోచించ‌రు. అలా చేయ‌డం వ‌ల‌న స్టార్స్‌కి ఎంత ఇబ్బంది ఉంటుంది అనేది ఆలోచించ‌రు. అందుకే పబ్లిక్ లో ఫ్యాన్స్ పై బాలయ్య చేయి చేసుకోవడంలో తప్పు లేదని చెప్పారు పూరీ జ‌గ‌న్నాథ్.

సెల‌బ్రిటీల‌ని చూడ‌డానికి వ‌చ్చే వారిలో ఎక్కువ మంది ఆక‌తాయిలు ఉంటారు. ఛాన్స్ ఇస్తే జేబుల్లో చెయ్యిపెడతారు. ఒంటిమీద బంగారం లాక్కెల్తారు.. చేతిలో ఫోన్ మాయం చేస్తుంటారు. ఇలా నానా ర‌కాలుగా టార్చ‌ర్ పెడుతుంటారు. ఆడ‌, మ‌గ అనే తేడా లేకుండా ఎక్క‌డ ప‌డితే అక్క‌డ చేయి వేసి గ‌ట్టిగా ఒత్తుతుంటారు. సెల‌బ్స్ పబ్లిక్ లోకి వస్తే.. వీరు చేసే పనుల వల్ల హీరోయిన్లు ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే బాలయ్య చేసే పనిలో ఏమాత్రం తప్పుులేదు అని పూరీ స్ప‌ష్టం చేశారు. బాలకృష్ణమనసు చాలా మంచి మ‌న‌స్సు. ఇండస్ట్రీలో అందరికంటే ఆయన అంటేనే నాకు చాలా ఇష్టం అని పూరీ జ‌గ‌న్నాథ్ ఓ సంద‌ర్భంలో చెప్పుకొచ్చారు. ఆక‌తాయిల‌ని కొడితే ద‌గ్గ‌ర‌కి రావ‌డానికి భ‌య‌ప‌డి కాస్త కంట్రోల్‌లో ఉంటారు. బాల‌య్య త‌న ఫ్యాన్స్‌ని కొట్టాల‌ని ఏ నాడు అనుకోరు అని పూరీ జ‌గ‌న్నాథ్ చెప్పుకొచ్చారు.