Balagam Mogilaiah| మళ్లీ మొగిలయ్యకు అస్వస్థత..సాయం కోసం ఎదురుచూపు
Balagam Mogilaiah| జబర్ధస్త్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు దర్శకత్వంలో రూపొందిన చిత్రం బలగం. చిన్న సినిమాగా రూపొందిన ఈ చిత్రం పెద్ద హిట్టైంది. ఈ మూవీ క్లైమాక్స్‌లో భావోద్వేగభరిత పాటను ఆలపించిన.. జానపద కళాకారుడు మొగిలయ్య దంపతులు ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టారు. అం

Balagam Mogilaiah| జబర్ధస్త్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు దర్శకత్వంలో రూపొందిన చిత్రం బలగం. చిన్న సినిమాగా రూపొందిన ఈ చిత్రం పెద్ద హిట్టైంది. ఈ మూవీ క్లైమాక్స్‌లో భావోద్వేగభరిత పాటను ఆలపించిన.. జానపద కళాకారుడు మొగిలయ్య దంపతులు ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టారు. అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే గత కొద్ది రోజులుగా మొగిలయ్య అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. మొగిలయ్యకు కిడ్నీ, గుండె సంబంధింత వ్యాధులున్నాయి. దీని వలన కొన్నేళ్ల క్రితమే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేరాడు. చికిత్స తర్వాత కోలుకున్నాడు. ఇప్పుడు మరోసారి ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
మొగిలయ్యకు మెరుగైన వైద్యం అందించడం కోసం వరంగల్‌లోని సంరక్ష అనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈక్రమంలో మొగిలయ్య భార్య మాట్లాడుతూ.. చికిత్సకు తమ వద్ద డబ్బులు లేవని.. ప్రభుత్వం ఆదుకోవాలంటూ కన్నీటి పర్యంతం అయ్యింది.మొగిలయ్య కరోనా సమయంలోనే తీవ్ర అస్వస్థతకి గురి కాగా, ఆయనను హైదరాబాద్ తరలించి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించారు. ఆ తర్వాత ఆయన కోలుకున్నారు. అనంతరం దళితబంధు కింద యూనిట్ కూడా మంజూరు చేశారు. బలగం డైరెక్టర్ వేణుతో పాటు, మెగాస్టార్ చిరంజీవి కూడా ఆయనకు అప్పట్లో ఆర్థికసాయం చేశారు.
ఆయన ఆరోగ్యం క్రమేపి మెరుగుపడుతుందనుకున్న సమయంలో మొగిలయ్య ఆరోగ్యం తిరిగబెట్టింది.తీవ్ర అస్వస్థతకు గురికావటంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స కూడా డబ్బులు లేవని తన భర్తను ఆదుకోవాలని మెుగిలయ్య భార్య కొమురమ్మ ప్రభుత్వాన్ని వేడుకున్నారు. కిడ్నీ సమస్యలతో పాటు గుండె, కంటి చూపు మందగించడం వంటి అనారోగ్య సమస్యలు కూడా మొగిలయ్యాను వెంటాడుతున్నాయి. ఇక గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం మొగిలయ్య వైద్యానికి సాయం చేసిన విషయం తెలిసిందే,