Bigg Boss8| హోరా హోరీగా సాగిన నామినేష‌న్స్..ఎవ‌రికి ఎన్ని ఓట్లు ప‌డ్డాయంటే..!

Bigg Boss8| బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 స‌క్సెస్ ఫుల్‌గా ఎనిమిది వారాలు పూర్తి చేసుకుంది. ఆదివారం రోజు మ‌ణికంఠ సెల్ఫ్ ఎలిమినేట్ చేసుకొని బ‌య‌ట‌కి వెళ్లాడు. తనకు ఆరోగ్యం సహకరించడం లేదని , అందుకే తాను స్వయంగా ఎలిమినేట్ అవుతున్న‌ట్టు తెలిపాడు. ఈ రకంగా గౌతమ్‌కి బిగ్‌

  • By: sn    cinema    Oct 22, 2024 7:05 AM IST
Bigg Boss8| హోరా హోరీగా సాగిన నామినేష‌న్స్..ఎవ‌రికి ఎన్ని ఓట్లు ప‌డ్డాయంటే..!

Bigg Boss8| బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8(Bigg Boss) స‌క్సెస్ ఫుల్‌గా ఎనిమిది వారాలు పూర్తి చేసుకుంది. ఆదివారం రోజు మ‌ణికంఠ సెల్ఫ్ ఎలిమినేట్ చేసుకొని బ‌య‌ట‌కి వెళ్లాడు. తనకు ఆరోగ్యం సహకరించడం లేదని , అందుకే తాను స్వయంగా ఎలిమినేట్ అవుతున్న‌ట్టు తెలిపాడు. ఈ రకంగా గౌతమ్‌కి బిగ్‌ బాస్‌ హౌజ్‌లో లైఫ్‌ ఇచ్చాడు మణికంఠ. ఇక సోమ‌వారం రోజు దిష్టిబొమ్మలపై కుండలు పెట్టి తగిన కారణాలు చెప్పి నామినేట్ చేయాల్సిందిగా బిగ్ బాస్ ఆదేశించాడు. అయితే, మెగా చీఫ్ అయినందుకు గౌతమ్ కృష్ణ(goutham Krishna)ను ఎవరు నామినేట్ చేయకూడదని బిగ్ బాస్ తెలిపాడు. ఆ త‌ర్వాత బిగ్ బాస్ ఇంట్లో ఒక షీల్డ్ ఉంద‌ని,ఆ షీల్డ్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఆ సభ్యుడిని ఈ వారం నామినేట్ చేసిన ప్రతిసారి రూ. 50 వేలు బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ నుంచి కట్ అవుతాయని బిగ్ బాస్ అన్నారు.

దాంతో నామినేషన్ షీల్డ్‌ను హరితేజకు ఇచ్చాడు మెగా చీఫ్ గౌతమ్. ఈ వారం సేవ్ అయి మరో వారం వరకు ఉండి తనేంటో ప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో హరితేజకు ఆ నామినేషన్ షీల్డ్ ఇస్తున్నట్లు గౌతమ్ చెప్పుకొచ్చాడు.ఇక నామినేషన్ల లో విష్ణు ప్రియా(Vishnu Priya).. ప్రేరణ, నిఖిల్‌ని నామినేట్‌ చేసింది. ఏదైనా చెప్పాల్సి వచ్చినప్పుడు ప్రేరణ చెప్పే విధానం, ఆమె ఎక్స్ ప్రెషన్స్ చాలా ఇబ్బందిగా ఉంటుందని, అది తగ్గించుకోవాలని తెలిపింది. నిఖిల్‌.. హీరో నుంచి జీరో అయ్యాడని, ఆట మెరుగుపడాలని తెలిపింది. అనంతరం రోహిణి.. నిఖిల్‌, పృథ్వీలను నామినేట్‌ చేసింది. టాస్క్ లో డిఫెండ్ చేసే క్ర‌మంలో కాస్త ఓవ‌ర్‌గా రియాక్ట్ కావ‌డం ఇతరులకు ఇబ్బందిగా ఉందని తెలిపింది. పృథ్వీరాజ్‌ గేమ్‌ల్లో కనిపిస్తాడు, తప్ప హౌజ్‌లో పెద్దగా ఉన్నట్టే అనిపించదని తెలిపింది. ఇక పృథ్వీ.. ప్రేరణ, రోహిణిలను నామినేట్‌ చేశాడు. నయనీ పావని.. మెహబూబ్‌, నిఖిల్‌లను నామినేట్‌ చేసింది.

హరితేజ.. ప్రేరణ, మెహబూబ్‌లను నామినేట్‌ చేసింది. చివరగా నబీల్‌.. సైతం ప్రేరణ, హరితేజలను నామినేట్‌ చేశాడు. హరితేజని నామినేట్ చేస్తే యాభై వేలు ప్రైజ్‌ మనీ తగ్గుతున్నా ఇది నా నామినేషన్‌ అంటూ ఆమెని నామినేట్‌ చేశాడు. మంగ‌ళవారం కూడా నామినేషన్ ప్ర‌క్రియ జ‌ర‌గ‌నుంది. ఈ నామినేషన్స్‌లో విష్ణుప్రియ, మెహబూబ్‌ను యష్మీని నామినేట్ చేయనుందని సమాచారం. అలాగే, పృథ్వీ, నిఖిల్‌ను అవినాష్, నిఖిల్, విష్ణుప్రియను గంగవ్వ(Gangavva) నామినేట్ చేయనుందని తెలుస్తోంది. హరితేజను ఇంకొకరు నామినేట్ చేయడంతో మరో రూ. 50 వేలు కట్ అయినట్లు టాక్. ప్రస్తుతం హౌజ్‌లో అవినాష్‌, రోహిణి, హరితేజ, తేజ, యష్మి, ప్రేరణ, విష్ణు ప్రియా, నిఖిల్‌, పృథ్వీరాజ్‌, గంగవ్వ, నయని పావని, మెహబూబ్‌, నబీల్‌, గౌతమ్‌ కృష్ణ ఉన్న విషయం తెలిసిందే.