Samantha: సమంత కొత్త ఉత్సాహం.. రాజ్ కుటుంబంతో దివాళీ సెలబ్రేషన్స్
దీపావళి వేడుకల్లో రాజ్ నిడమూరు కుటుంబంతో కలిసి పాల్గొన్న సమంత ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్లిక్‌లతో ఆమెపై ఉన్న రిలేషన్ రూమర్స్ మళ్లీ హాట్ టాపిక్‌గా మారాయి.

సమంత (Samantha) మరోసారి నేషనల్ వైడ్‌గా హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే రాజ్ నిడమోరు (RajNidimoru )తో డేటింగ్ అంటూ నిత్యం వార్తల్లో నిలుస్తున్న ఆ బ్యూటీ మరోసారి ఆ వార్తలకు మరింత బలం చేకూరుస్తూ దర్శణమిచ్చింది. దీపావళి సందర్భంగా సోమవారం రాజ్ ఇతర కుటుంబ సభ్యులతో ఆనందోత్సవాల మధ్య బాణా సంచా కాల్చుతూ పండుగను సెలబ్రేట్ చేసుకుంది.
ఇందుకు సంబంధించిన ఫొటోలు సమంతే స్వయంగా తన ఇన్‌స్టా అకౌంట్‌లో షేర్ చేయగా క్షణాల్లో వైరల్ అయ్యాయి. వీటిని చూసిన వారంతా సమంత ఏదో హింట్ ఇస్తుందంటూ గుసగుసలాడుకుంటున్నారు.
రాజ్, సమంతల మధ్య ఉన్న రిలేషన్ రూమర్స్ కాదు నిజమే అని మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
అంతకుమందు సమంత తన లోని దయార్థ హృదయాన్ని చాటుతూ ఓ ఎన్జీవో ఫౌండేషన్‌లో ఉంటున్న ఒంటరి పిల్లలతో చాలాసేపు గడిపింది. వారితో కలిసి పండుగను జరుపుకుంది. raj nidimoru diwali celebrations