Bigg Boss8|మొత్తానికి మెగా చీఫ్ అవతారం ఎత్తిన అవినాష్..డేంజర్ జోన్‌లో ఆ కంటెస్టెంట్
Bigg Boss8| బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8లో టాస్క్‌లు హోరా హోరీగా సాగుతున్నాయి. ఒకవైపు లవ్ ట్రాక్‌లు, మరోవైపు టాస్క్‌లతో ప్రేక్షకులకి కావల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ దక్కుతుంది.ఇక బిగ్ బాస్ 9వ వారం చీఫ్ కోసం పోటీ పడగా, చివరికి అవినాష్ విజయం సాధించి చీఫ్‌గా ఎన్ని

Bigg Boss8| బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8లో టాస్క్‌లు హోరా హోరీగా సాగుతున్నాయి. ఒకవైపు లవ్ ట్రాక్‌లు, మరోవైపు టాస్క్‌లతో ప్రేక్షకులకి కావల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ దక్కుతుంది.ఇక బిగ్ బాస్ 9వ వారం చీఫ్ కోసం పోటీ పడగా, చివరికి అవినాష్ విజయం సాధించి చీఫ్‌గా ఎన్నికయ్యాడు. రెండు రోజులు జరిగిన టాస్క్ లలో పోరు అయితే చాలా హోరా హోరీగా జరిగింది. ఇందులో నిఖిల్, ప్రేరణ, నబిల్, హరితేజ, టేస్టీ తేజ, అవినాష్, యష్మి, పాల్గొనగా.. అందులో రౌండ్ రౌండ్ కు ఒకరు బయటకు వస్తూ.. చివరకు నబిల్, అవినాష్ మిగిలారు. నిఖిల్, నబిల్ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్స్ ని కూడా ఓడించి అవినాష్ చివరికి మెగా చీఫ్ అయ్యాడు. దీంతో అందరు అతనికి విషెస్ తెలియజేశారు.
ఇక బిగ్ బాస్ హౌజ్‌లో దీవాళి సంబరాలు అంబరాన్ని అంటాయి. తేజ, నయని పావని గొడవతో డే స్టార్ట్ కాగా, మధ్యలో దూరిన గౌతమ్ ఇద్దరిని కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేశాడు. ఇక హౌస్ లో మగవారికి, మహిళలకు రంగోళీపోటీ పెట్టాడు బిగ్ బాస్. రెండు టీమ్ లు అద్భుతంగా రంగోళీ వేశారు. ఇక బిగ్ బాస్ దివాళి స్వీట్స్ పంపించడంతో పాటు.. నబిల్ కు కూడా పండగ సందర్భంగా స్వీట్స్ తినే అవకాశం కల్పించారు. గతంలో హౌస్ మేట్స్ కోసం నబిల్ స్వీట్స్ ను త్యాగం చేసిన సంగతి తెలిసిందే. పండగ సందర్భంగా ఇంటి నుంచి వచ్చిన వీడియోస్ ను బిగ్ బాస్ ప్లే చేయడంతో చాలా సంతోషించాడు. హరితేజకు తన కూతురు నుంచి వీడియో రావడంతో చూసి మురిసిపోయింది.
నిఖిల్, గంగవ్వ, గౌతమ్, ప్రేరణలకు మాత్రం వీడియో సందేశం చూపించలేదు బిగ్ బాస్. ఈ రోజు ఏమైన చూపిస్తారా అని ప్రేక్షకులు అనుకుంటున్నారు.ఇక వీకెండ్ రావడంతో ఎలిమినేషన్ భయం అందరిలో ఉంది. తొమ్మిదో వారం నామినేషన్స్‌లో గౌతమ్, యష్మీ, టేస్టీ తేజ, నయని పావని, హరితేజ ఉన్నారు. అయితే వీరిలో యష్మీ గౌడ టాప్‌లో కొనసాగుతూ వచ్చింది. ఆ తర్వాత స్థానంలో గౌతమ్ ఉన్నాడు. తన స్టైల్ గేమ్‌తో బాగానే ఆకట్టుకుంటున్నాడు గౌతమ్. మూడో ప్లేస్‌లో టేస్టీ తేజ, నాలుగో స్థానంలో హరితేజ, ఐదో స్థానంలో నయని పావని ఉన్నారు. అంటే, ఈ వారం ఎలిమినేట్ అయ్యేందుకు డేంజర్ జోన్‌లో ఉన్నది హరితేజ, నయని పావని ఉన్నారు.వీరిలో నయని పవానినే ఎలిమినేట్ అవుతుందని అంటున్నారు.