Horoscope | శ‌నివారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారు శ‌త్రువుల‌పై విజ‌యం సాధిస్తారు..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  • By: raj |    devotional |    Published on : Oct 18, 2025 6:46 AM IST
Horoscope | శ‌నివారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారు శ‌త్రువుల‌పై విజ‌యం సాధిస్తారు..!

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు ఫలవంతమైన రోజు. కుటుంబ శ్రేయస్సు కోసం పనిచేస్తారు. వృత్తి పరంగా స్థిరత్వం, సన్నిహితుల సహకారం ఉంటుంది. ఉద్యోగులు పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ఆర్థికంగా సానుకూల పరిస్థితులు ఉంటాయి. వైద్యవృత్తి, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి ఈ రోజు మంచి రోజు.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. ఆర్థికాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు, కలహాలకు దూరంగా ఉంటే మంచిది. సృజనాత్మక నిర్ణయాలు మేలు చేస్తాయి.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వ్యాపారాలు కొత్త ప్రాజెక్టులు, ఒప్పందాలకు దూరంగా ఉంటే మంచిది. ఉద్యోగులు పని పట్ల ఏకాగ్రత తగ్గకుండా జాగ్రత్త పడండి. అధికారులతో ఆచి తూచి నడుచుకోండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించండి.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముందుచూపు, బుద్ధిబలంతో వృత్తి ఉద్యోగాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. వ్యాపారంలో నిర్లక్ష్యం తగదు. చంచల బుద్ధితో తీసుకునే నిర్ణయాలు చేటు చేస్తాయి. అనవసర ఆందోళన తగ్గించుకుంటే మంచిది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఆత్మ విశ్వాసంతో ఆటంకాలు అధిగమిస్తారు. బుద్ధిబలంతో కీలక సమస్యలు పరిష్కరిస్తారు. కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యలు తొలగిపోతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి.

కన్య (Virgo)

కన్యా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి, శ్రమ పెరుగుతాయి. శ్రమకు తగిన ఫలితాన్ని కూడా అందుకుంటారు. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో ముందుచూపుతో నడుచుకుంటే ఇబ్బందులు ఉండవు.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ రోజు ఆర్థికంగా కలిసి వచ్చే రోజు. ఏ రంగంలోనైనా విజయం సాధిస్తారు. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు. వ్యాపారంలో విపరీతమైన లాభాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. తారాబలం అనుకూలిస్తోంది కాబట్టి ఈ రోజు ఏ పని మొదలు పెట్టినా విజయం వెన్నంటే ఉంటుంది. కుటుంబంలో శాంతి సౌఖ్యాలు నెలకొంటాయి. జీవిత భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది. కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి ఆర్థిక లబ్ధి కలుగుతుంది. సంతానం అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి పరమైన సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. చేపట్టిన పనుల్లో ఆచి తూచి అడుగేయండి. శత్రుభయం పొంచి ఉంది. ఉద్యోగులు అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. కలహాలకు దూరంగా ఉంటే మంచిది. వ్యాపారులకు పోటీదారులతో సమస్యలుండవచ్చు. సమయానుకూల నిర్ణయాలతో సత్ఫలితాలుంటాయి.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. న్యాయపరమైన వివాదాల్లో ప్రతికూలతలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు అశాంతి కలిగిస్తాయి. పనిఒత్తిడి, శ్రమ పెరుగుతాయి. అధికారులతో వివాదాలు ఏర్పడవచ్చు. ఆర్థికపరంగా నష్టాలు సంభవిస్తాయి. కుటుంబంలో వివాదాలు చెలరేగే అవకాశముంది. శ‌నివా

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థికంగా బలోపేతం అవుతారు. కుటుంబంపై మీరు చూపే ఆదరణ మీకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. కీలక వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు సంతోషకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి పరంగా నేడు ప్రోత్సాహకరంగా ఉంటుంది. గ్రహసంచారం అనుకూలంగా ఉంది కాబట్టి వేసే ప్రతి అడుగు విజయాన్ని అందిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. విశేషమైన ఆర్థిక లాభాలు అందుకుంటారు. శుభవార్తలు వింటారు. కుటుంబ సౌఖ్యం, గృహశాంతి లభిస్తాయి.