Uttam Kumar Reddy | నది జలాల హక్కుల సాధనలో ఏ పోరాటానికైనా సిద్దం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణ నీటి హక్కుల కోసం ఏ పోరాటానికైనా సిద్ధం! మట్టపల్లిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. గవర్నర్ చేతుల మీదుగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన..
విధాత: కృష్ణా, గోదావరి నది జలాల సాక్షిగా తెలంగాణ నది జలాల హక్కుల సాధనకు పరిరక్షణకు ఏ పోరాటానికైనా సిద్ధం అని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మన హక్కును కాపాడుకోవడానికి ఒక్క నీటి చుక్క కూడా వదులుకోబోమని ప్రకటించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం పరిధిలోని మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, సుధా దేవ్ వర్మ దంపతులు శుక్రవారం దర్శనం చేసుకున్నారు. దర్శనం తర్వాత స్థానిక మైదానంలో కొత్తగా మంజూరైన 150 కోట్ల రూపాయల హుజూర్ నగర్ ప్రభుత్వ వ్యవసాయ కళాశాల, 50 కోట్ల రూపాయల కోదాడ జవహర్ నవోదయ విద్యాలయ శిలఫలకాలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, ఆడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతిలతో కలిసి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా నిర్వహించిన సభలో మంత్రి ఉత్తమ్ మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 85 శాతం జనాభాకి ఉచితంగా సన్న బియ్యం ఇస్తున్నాం అన్నారు. అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం అని గుర్తు చేశారు .దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా 71.7 లక్షల మెట్రిక్ టన్నుల ఖరీఫ్ వరి ధాన్యం మన ప్రభుత్వం కొనుగోలు చేసిందని, 19వేల కోట్ల రూపాయలు మద్దతు ధర, బోనస్ గా మా ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పర్యవేక్షణలో ఖరీఫ్ పంటలో 112లక్షల మెట్రిక్ టన్నుల రికార్డు స్థాయిలో ధాన్యం పండిందని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి :
అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల హక్కులు మీకు తెలుసా?
Ajay Banga | రానున్న 12-15 ఏళ్లలో… 400 మిలియన్ల ఉద్యోగాలకు 1.2 బిలియన్లు పోటీ : అజయ్ బంగా
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram