Telangana Global Summit : తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా రోబో
హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో ప్రారంభమైన తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో ఓ రోబో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇది ప్రాంగణ ప్రవేశ ద్వారం వద్ద వీఐపీలకు స్వాగతం పలుకుతూ, హాయ్ చెబుతూ సందడి చేసింది.
విధాత, హైదరాబాద్: హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో సోమవారం అట్టహాసంగా ప్రారంభమైన తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో ఓ రోబో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ప్రాంగణం ప్రవేశ ద్వారం వద్ద వీఐపీలకు స్వాగతం పలుకుతూ రోబో ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, అధికారులకు, హీరో నాగార్జునకు రోబో హాయ్ చెబుతూ..ప్రాంగణంతో కలియ తిరుగుతూ సందడి చేసింది.
గ్లోబల్ సమ్మిట్ కి వస్తున్న అతిథులకు తెలంగాణ సంప్రదాయ నృత్యాలతో తెలంగాణ కళాకారులు స్వాగతం పలికారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమ్మిట్ ను ప్రారంభించి ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను, భవిష్యత్ లక్ష్యాలను వివరించారు. జాతీయ గీతం, తెలంగాణ రాష్ట్ర గీతాలాపనతో సమ్మిట్ ప్రారంభమైంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎమ్మెల్యేలు, హీరో నాగార్జున సందర్శించారు. కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి సమ్మిట్ కు హాజరయ్యారు. సమ్మిట్ వద్ద 6వేల మందికి పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
#TelanganaRisingGlobalSummit —
Robot named Ex man from China greets visitors at the entry of #Telangana Rising Global Summit venue. pic.twitter.com/hLRuXqwm1B
— NewsMeter (@NewsMeter_In) December 8, 2025
ఇవి కూడా చదవండి :
BRS Releases Chargesheet : రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ చార్జ్ షీట్
Akkineni Nagarjuna : అన్నపూర్ణ స్టూడియోస్ ని ఫ్యూచర్ సిటీకి తీసుకొస్తాం
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram