Akkineni Nagarjuna : అన్నపూర్ణ స్టూడియోస్ ని ఫ్యూచర్ సిటీకి తీసుకొస్తాం
ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున, అన్నపూర్ణ స్టూడియోస్‌ను హైదరాబాద్‌లోని ఫ్యూచర్ సిటీకి తరలిస్తామని కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు.
విధాత, హైదరాబాద్ : అన్నపూర్ణ స్టూడియోస్ ను ఫ్యూచర్ సిటీకి తీసుకొస్తామని ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున కీలక ప్రకటన చేశారు. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో కలిసి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా నాగార్జున మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ విజన్ డాక్యుమెంట్ నేను చదివాను, చాలా అద్భుతంగా ఉందన్నారు. సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు. ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ ఫిలిం హబ్ ని కూడా తయారు చేయాలని చర్చలు జరుగుతున్నాయన్నారు.
అజయ్ దేవగణ్ వంటి వారు ఇంటర్నేషనల్ ఫిల్మ్ సిటీ నిర్మించేందుకు ముందుకు రావడం హర్షనీయమన్నారు. అలాగే మేం కూడా అన్నపూర్ణ స్టూడియోస్ ను ఫ్యూచర్ సిటీకి తీసుకొస్తాం అన్నారు. 50ఏళ్లుగా మేం తెలంగాణలోనే అన్నపూర్ణ స్టూడియోస్ ను నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు.
ఇవి కూడా చదవండి :
Sameera Reddy | ఎన్టీఆర్ హీరోయిన్ పెళ్లి విషయంలో తెలియని ఆసక్తికర నిజం… కన్యాదానం చేసిన వ్యక్తి ఎవరో తెలుసా?
Indigo : ఇండిగో సంక్షోభం.. నేడు 300కు పైగా విమానాలు రద్దు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram