Jampanna Vagu | జంపన్నవాగులో ముగ్గురుని రక్షించిన ఎస్డిఆర్ఎఫ్

మేడారంలో ఎస్‌డీఆర్‌ఎఫ్ సాహసం! జంపన్నవాగులో మునిగిపోతున్న ముగ్గురిని కాపాడిన పోలీసులు. ప్రాణాలు పణంగా పెట్టి భక్తులను రక్షించిన కానిస్టేబుళ్లకు ప్రశంసలు..

Jampanna Vagu | జంపన్నవాగులో ముగ్గురుని రక్షించిన ఎస్డిఆర్ఎఫ్

విధాత, ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ అతిపెద్ద జాతర మేడారం సందర్భంగా జంపన్న వాగు వద్ద స్నానాలు ఆచరిస్తుండగా జరిగిన ప్రమాదంలో మునిగిపోతున్న ముగ్గురిని ఎస్‌ డీ ఆర్‌ ఎఫ్ ( రాష్ట్ర విపత్తు స్పందన దళం ) 5వ బెటాలియన్, తెలంగాణ ప్రత్యేక పోలీస్ పోలీస్ సిబ్బంది శుక్రవారం రక్షించారు. జంపన్న వాగులో స్నానాలను ఆచరించడానికి వచ్చిన భూపాలపల్లి వాసులు మేకల జంపయ్య (36), మేకల సరిత( 14) మేకల శిరీష (13) ముగ్గురు అకస్మాత్తుగా నీటిలో మునిగిపోవడంతో, అక్కడ విధుల్లో ఉన్న ఎస్ డి ఆర్ ఎఫ్ సిబ్బంది కానిస్టేబుల్ లు రాందాస్,ప్రవీణ్, రాజశేఖర్, రవి, రాజు, హరీష్ తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి నీటిలోకి దిగి, మునిగిపోతున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు ఎస్ డి ఆర్ ఎఫ్ రక్షక బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, తమ కుటుంబ సభ్యుల ప్రాణాలను కాపాడినందుకు ధన్యవాదాలు తెలిపారు. మేడారం జాతర వంటి కార్యక్రమంలో ప్రజల ప్రాణ భద్రత కోసం ఎస్ డి ఆర్ ఎఫ్ ఎల్లప్పుడూ అప్రమత్తంగా విధులు నిర్వహిస్తుందని, ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా ప్రజలకు సహాయం అందించేందుకు సిద్ధంగా ఉంటుందని 5వ బెటాలియన్ కమాండెంట్ కె.సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు, ప్రాణాలు సైతం తెగించి భక్తులను కాపాడినటువంటి సిబ్బందికి కమాండెంట్ అభినందనలు తెలియజేశారు.

ఇవి కూడా చదవండి :

70 Yr Old Man First Vlog | విజయానికి వయసు అడ్డుకాదు.. 70 ఏండ్ల వయసులో తొలి వ్లాగ్‌తో అదరగొట్టిన పెద్దాయన
Ajay Banga | రానున్న 12-15 ఏళ్లలో… 400 మిలియన్ల ఉద్యోగాలకు 1.2 బిలియన్లు పోటీ : అజయ్ బంగా