Bigg Boss8|హౌజ్‌మేట్స్‌ని వ‌ణికించిన గంగ‌వ్వ‌.. బ‌య‌ట‌కి వెళ్లిపోతాన‌న్న అవినాష్‌

Bigg Boss8| బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్‌లో ఫ‌న్ మాములుగా లేదు.గంగ‌వ్వ నుండి అంద‌రు కంటెస్టెంట్స్ కూడా త‌మ‌దైన శైలిలో హాస్యం పంచే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. తాజా ఎపిసోడ్‌లో అవినాష్ ని జిమ్ ట్రైనర్ గా మార్చారు బిగ్ బాస్‌. ఈ టాస్క్ లో పేక్షకులను బాగా నవ్వించారు. ఇక రేష‌న్ కూడా పంప‌డంతో అంద‌రు దిల్ ఖుష్ అయ్యారు. ఇక గంగ‌వ్వ అర్ధ‌రాత్రి జుట్టు విర‌బూసుకొని ప్ర‌తి ఒక్క‌రిని భ‌య‌పెట్టించింది. తేజ, అవినాష్, గంగవ్వ

  • By: sn    cinema    Oct 24, 2024 9:42 AM IST
Bigg Boss8|హౌజ్‌మేట్స్‌ని వ‌ణికించిన గంగ‌వ్వ‌.. బ‌య‌ట‌కి వెళ్లిపోతాన‌న్న అవినాష్‌

Bigg Boss8| బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్‌(Bigg Boss)లో ఫ‌న్ మాములుగా లేదు.గంగ‌వ్వ నుండి అంద‌రు కంటెస్టెంట్స్ కూడా త‌మ‌దైన శైలిలో హాస్యం పంచే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. తాజా ఎపిసోడ్‌లో అవినాష్ ని జిమ్ ట్రైనర్ గా మార్చారు బిగ్ బాస్‌. ఈ టాస్క్ లో పేక్షకులను బాగా నవ్వించారు. ఇక రేష‌న్ కూడా పంప‌డంతో అంద‌రు దిల్ ఖుష్ అయ్యారు. ఇక గంగ‌వ్వ అర్ధ‌రాత్రి జుట్టు విర‌బూసుకొని ప్ర‌తి ఒక్క‌రిని భ‌య‌పెట్టించింది. తేజ, అవినాష్, గంగవ్వ(Gangavva) కలిసి ప్రాంక్ చేయ‌గా, హ‌రితేజ అయితే వ‌ణికిపోయింది. ఇక నయనీపావని, యష్మి అయితే దూరం నుండే చూస్తూ భ‌య‌ప‌డిపోయారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ల గురించి డిస్కర్షన్ నడిచింది.

ఇక గౌతమ్ గురించి కూడా యష్మి నిఖిల్ దగ్గర ప్రస్తావన తీసుకువచ్చింది. ఇక గత వారం ఫుడ్ వేస్ట్ అయిన నేపధ్యంలో బిగ్ బాస్ ఈసారి రేషన్ టైమ్ ను బాగా తగ్గించారు. దాంతో నిఖిల్ ఎంత ఫాస్ట్ గా వెళ్ళి రేషన్ తీసుకున్నా.. అందులో కూరగాయలు మిస్ కావ‌డంతో అంద‌రు కాస్త అప్సెట్ అయ్యారు. ఇక విష్ణు ప్రియ‌.. పృథ్వీని నాతో ఫ్రెండ్‌గా అయిన ఉండొచ్చు క‌దా అని అడిగింది. ఆ త‌ర్వాత తేజ‌తో పృథ్వీ మాట్లాడుతూ.. ‘ఆ గోల్డ్ నెక్లెస్ ఎక్కడ చేయించుకున్నావ్ అని అడిగాడు ఈలోపు ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని ఎదురు చూస్తున్న విష్ణు ప్రియా ‘ఒక గోల్డ్ మరొక గోల్డ్ ని వేసుకోవడం ఫస్ట్ టైమ్ చూస్తున్నాను అని అన్నది. అప్పుడు ఓ రేంజ్‌లో రెస్పాన్స్ ఇచ్చారు.

దాంతో అవినాష్ (Avinash)ఈ సమయంలోనే ఇవన్నీ చూడటం నావల్ల కాదు.. ‘నేను వెళ్ళిపోతాను’ అని అవినాష్ కామెడీ చేస్తుండగా..బిగ్ బాస్ నిజంగానే గేట్లు ఎత్తేశాడు. ఇక ఆ త‌ర్వాత బిగ్ బాస్ హౌస్ లో మళ్లీ మెగా చీఫ్ ఎన్నుకునే టైమ్ దగ్గ‌ర‌ప‌డ‌డంతో అంద‌రు అల‌ర్ట్ అయ్యారు. ముందుగా ఓ రాజ్యం మాప్ పెట్టుకుని.. టాస్క్ లు మొదలుపెట్టాడు బిగ్ బాస్. ఇక మందటి టాస్క్ లో నీరుకు సంధించి.. రాయల్ క్లాన్ గెలిచారు. ఇక ఈ రాజ్యంలో నీటి విభాగం గెలుచుకున్నారు. ఈసందర్భంగా రాయల్స్ క్లాన్ లో రోహిణి(Rohini) మెగా చీఫ్ కంటెండర్ గా అనౌన్స్ చేయగా.. అటు ఓడిపోయిన ఓజీ క్లాన్ నుంచి ఒకరు రేస్ నుంచి తప్పుకోవాలి అని చెప్ప‌డంతో యష్మి టాస్క్ నుంచి స్వచ్చందంగా తప్పుకుంది. అయితే రోహిణిని అందరు చీఫ్ కంటెండెర్ గా తీసుకోవడం ఇఫ్టంలేని హరితేజ… ఆమెని ప‌క్క‌కి పిలిచి ఏదో విష‌యం చెప్పింది.