Bigg Boss8|గంగవ్వ వారిద్దరికి పెద్ద జలకే ఇచ్చిందిగా.. జాక్ పాట్ కొట్టిన ప్రేరణ
Bigg Boss8|బిగ్ బాస్ హౌజ్‌లో కొత్త మెగా చీఫ్ అయ్యేందుకు కంటెస్టెంట్స్ టాస్క్‌లలో పోటీ పడిన విషయం తెలిసిందే. కంటెండర్ షిప్ కోసం కంటెండర్ షిప్ పట్టు అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్కలో పృథ్వీని తనతో ఎవరైతే పోటీ పడాలని అనుకుంటున్నాడో తానే ఎంచుకునే అవకాశం ఇచ్చాడు.

Bigg Boss8|బిగ్ బాస్ హౌజ్‌లో కొత్త మెగా చీఫ్ అయ్యేందుకు కంటెస్టెంట్స్ టాస్క్‌లలో పోటీ పడిన విషయం తెలిసిందే. కంటెండర్ షిప్ కోసం కంటెండర్ షిప్ పట్టు అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్కలో పృథ్వీని తనతో ఎవరైతే పోటీ పడాలని అనుకుంటున్నాడో తానే ఎంచుకునే అవకాశం ఇచ్చాడు. ఆయన విష్ణు ప్రియని ఎంపిక చేసుకున్నాడు. ఇక దీనికి యష్మీ సంచాలకురాలిగా వ్యవహరించింది. అయితే టాస్క్ మొదలు కాగానే విష్ణు తొలి కీ దక్కించుకుంది. ఇక రెండో కీ కోసం విష్ణు వెతుకుతుండగా, ఆమెకి దొరక్కుండా మోసం చేశాడు పృథ్వీ. ఈ క్రమంలో తన కంటెండర్‌షిప్ బ్యాడ్జ్‌ను కాపాడుకున్నాడు పృథ్వీ ఇక ఈ టాస్క్‌లో గెలిచిన పృథ్వీకి 99 వేల ప్రైజ్‌మనీ దక్కింది.
ఈ టాస్క్‌లో విన్ అయిన పృథ్వీకి ఒకరిని చీఫ్ కంటెండర్ చేసే ఛాన్స్ ఇచ్చాడు బిగ్‌బాస్. అప్పుడు పృథ్వీ.. విష్ణు ప్రియ పేరు చెప్పి ఆమెపై పొగడ్తల వర్షం కురిపించాడు. పృథ్వీది రాంగ్ గేమ్ అని తేజ, రోహిణి ఆరోపణలు చేసిన విష్ణు మాత్రం పృథ్వీకే తన సపోర్ట్ అందించింది. ఇక చీఫ్ కంటెండర్‌గా నిఖిల్‌ను సెలెక్ట్ చేయాలని అనుకున్నాడు పృథ్వీ. నబీల్ వచ్చి అతడిని డైవర్ట్ చేశాడు. యష్మీ, విష్ణుప్రియ, ప్రేరణలకు బరువైన సంచి పేరుతో ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ గేమ్‌లో యష్మి పూర్తిగా తెలిపోయింది. ప్రేరణ, విష్ణుప్రియ మధ్య పోటీ సాగగా, అందులో విష్ణుప్రియ గెలిచేలా కనిపించింది. చివరలో విష్ణుప్రియ బ్యాగ్ కొట్టేసి ప్రేరణ విన్నర్‌గా నిలిచింది
ఈ టాస్క్‌లో గెలిచిన ప్రేరణకు జాక్‌పాట్ తగింది. మ్యాజిక్ బ్రీఫ్‌కేస్ ద్వారా రెండు లక్షల పన్నెండు రూపాయలు దక్కాయి. ఆ తర్వాత ప్రేరణ, టేస్టీ తేజను కన్ఫేషన్ రూమ్‌కు పిలిచిన బిగ్ బాస్.. ముందుగా ప్రేరణని హౌజ్‌లోని గాసిప్ చెప్పమని అడిగాడు.దానికి యష్మి విషయంలో నిఖిల్ సన్‌ఫ్లవర్ అవుతున్నాడని అన్నది. హౌజ్‌లో జెన్యూన్ ఎవరంటే గంగవ్వ పేరు చెప్పింది. టేస్టీ తేజను కూడా గాసిప్ గురించి అడిగితే యష్మి, నిఖిల్ లవ్ స్టోరీ గురించే చెప్పాడు.ఈ హౌజ్‌లో నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టమని గంగవ్వను అడిగింది విష్ణుప్రియ. గంగవ్వ పృథ్వీ పేరు చెప్పింది. నేనంటే ఇష్టం లేదా అని గంగవ్వతో అంటే నువ్వు కూడా ఇష్టమేనని గంగవ్వ సమాధానమిచ్చింది. ఆ తర్వాత తల్లిలేనిపిల్ల అంటూ విష్ణుప్రియపై గంగవ్వపై ప్రేమ చూపించింది. అప్పుడు పృథ్వీ అందుకే ఆరెంజ్ బ్రీఫ్ కేసు ఇచ్చానని అంటాడు. అప్పుడు చెల్లెలిగా నిన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నందుకైనా ఇవ్వాల్సిందేనని గంగవ్వ అనడంతో అందరు షాకయ్యారు. ఇక బిగ్‌బాస్ కొత్త మెగా చీఫ్‌గా ప్రేరణ గెలిచినట్టు తెలుస్తుంది.