Bigg Boss8|కొట్టుకునేంత పని చేసిన పృథ్వీ-నబీల్..విష్ణు ప్రియని టార్గెట్ చేసిన ప్రేరణ
Bigg Boss8|ఈ సారి బిగ్ బాస్ హౌజ్‌లో సమరం మాములుగా లేదు. తిట్టుకోవడాలు, ప్రేమించుకోవడాలు, గిల్లికజ్జాలు ఇలా ప్రతీది ఇంట్రెస్టింగ్‌గా మారింది. తాజా ఎపిసోడ్‌లో అనేక ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయి.కంటెస్టెంట్స్‌కు ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ దక్కించుకోవడం కోసం బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చాడు. పాము తనదగ్గరున్న ఆకలి తీర్చుకోవడానికి మీ వద్ద ఉన్న గోల్డెన్ ఎగ్స్ అడుగుతుందని , అయితే ఎవరి ఎగ్ అయితే పాము తినేస్తుందో వారికి

Bigg Boss8|ఈ సారి బిగ్ బాస్ హౌజ్‌లో సమరం మాములుగా లేదు. తిట్టుకోవడాలు, ప్రేమించుకోవడాలు, గిల్లికజ్జాలు ఇలా ప్రతీది ఇంట్రెస్టింగ్‌గా మారింది. తాజా ఎపిసోడ్‌లో అనేక ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయి.కంటెస్టెంట్స్‌కు ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ దక్కించుకోవడం కోసం బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చాడు. పాము తనదగ్గరున్న ఆకలి తీర్చుకోవడానికి మీ వద్ద ఉన్న గోల్డెన్ ఎగ్స్ అడుగుతుందని , అయితే ఎవరి ఎగ్ అయితే పాము తినేస్తుందో వారికి షీల్డ్ దక్కదని, పాము ఎవరి ఎగ్ అయితే తినదో వారికే ఎవిక్షన్ ఫ్రీ పాస్ దక్కుతుందని బిగ్‌బాస్ తెలియజేశాడు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఎవరికి అయితే రాకూడదని అనుకుంటున్నావో ఐదుగురు సభ్యులని సెలక్ట్ చేయాలని మెగా ఛీఫ్ ప్రేరణకి పరీక్ష పెట్టాడు బిగ్ బాస్.
దాంతో ప్రేరణ.. విష్ణుప్రియ, గంగవ్వ, పృథ్వీ, గౌతమ్, హరితేజల ఎగ్స్‌ను పాము నోట్లో వేసింది ప్రేరణ. మెగా చీఫ్ అయిన ప్రేరణపై గంగవ్వ ఫైర్ అయ్యింది. నీ ఫ్రెండ్స్‌ను కాపాడుకున్నావని హరితేజ పంచ్‌లు వేసింది.ఇక ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను యష్మికి దక్కకుండా అవినాష్, నబీల్ ప్లాన్ చేశారు. తనను మెగా చీఫ్ టాస్క్‌లో ఓడించిన యష్మిపై నబీల్ రివేంజ్ తీర్చుకున్నాడు. అయితే ఇలా ఎగ్స్ వేస్తూ పోవడంతో చివరకు నబీల్ ఎగ్ ఒక్కటే మిగలడంతో అతడికి ఎవిక్షన్ షీల్డ్ దక్కింది. అయితే మెగా చీఫ్ కోసం జరిగిన పోరులో నబిల్ పగపట్టి పృధ్వీని టాస్క్ నుంచి బయటపడేలా చేశాడు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్త ముదిరి కొట్టుకునేంత వరకూ వెళ్లింది. కాని చుట్టు ఉన్నవాళ్ళు ఆపడంతో కంట్రోల్ అయ్యారు.
ఆ సమయంలో వారి అరుపులతో బిగ్ బాస్ హౌస్ దద్దరిల్లిపోయింది. నిజంగా తన్నుకుంటారేమో అని ఆడియన్స్ భయపడేలా చేశారు ఇద్దరు. ఎవరిది తప్పు అనేది మాత్రం ఇక వీకెండ్ రానే వచ్చింది.. నాగార్జున క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక మెగా చీఫ్ అయిన వెంటనే ప్రేరణ.. విష్ణు ప్రియను టార్గెట్ చేయడం మొదలు పెట్టింది. అవి నీట్ గా పెట్టుకో.. నీటు గా చదురుకో.. ఇలా విష్ణును టార్చర్ చేయడం స్టార్ట్ చేసింది ప్రేరణ. ప్రేరణ టార్చర్ తట్టుకోలేని విష్ణు ప్రియ.. తాను నచ్చినట్టు ఉంటానని ఎదురు చెబుతుంది. తన బాధని బిగ్‌బాస్‌కి తెలియజేస్తుంది. ఇక విష్ణు ప్రియ తన సామాన్లని సర్ధుకపోవడంతో చివరికి ప్రేరణనే సర్ధుతుంది. ఇక ఈ రోజు శనివారం కావడంతో నాగ్ ఎంట్రీ ఉంటుంది. ఎవరికి ఎలాంటి క్లాసులు పీకుతాడో చూడాల్సి ఉంది.