Telugu Youtubers: బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్.. 11మంది తెలుగు యూట్యూబర్లపై కేసులు!

Telugu Youtubers:
విధాత: బెట్టింగ్ యాప్స్ తో ఆమాయక ప్రజలు ఆన్ లైన్ మోసాల బారిన పడి ఆత్మహత్యల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై పోలీస్ శాఖ ఉక్కు పాదం మోపుతోంది. తాజాగా 11 మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు. యాంకర్ శ్యామల, విష్ణుప్రియ, సుప్రిత, రీతూ చౌదరి, హర్షసాయి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ, సుధీర్ తదితరులపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు.
Youtubers: వారు అరెస్టు.. వీరు అలర్ట్! తప్పైంది.. క్షమించమంటున్న ముద్దుగుమ్మ
అలాగే సూర్యాపేటలో భయ్యా సన్నీ యాదవ్, ఏపీలో లోకల్ బాయ్ నానిలపై కేసులు నమోదయ్యాయి. త్వరలోనే బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ పైనా కేసులు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యువత జీవితాలను నాశనం చేస్తున్న బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ పై సీరియస్ ఫోకస్ పెట్టిన టీజీఆర్టీసీ ఎండీ, సీనీయర్ ఐపీఎస్ వీ.సీ. సజ్జనార్ ఫిర్యాదుతో కదలిసిన పోలీస్ శాఖ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లపై వరుస కేసులు, అరెస్టులతో హడలెత్తిస్తుంది.
మరోవైపు తాజాగా హీరోయిన్ కాజల్ గతంలో బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసిన వీడియో బయట పడింది. దీంతో ఓ నెటిజన్ ఈ వీడియోను వీసీ సజ్జనర్ కి ట్యాగ్ చేస్తూ సవాల్ విసిరాడు. సజ్జనార్ సార్..మరి ఇప్పుడు కాజల్ అగర్వాల్ ని అరెస్ట్ చేయగలరా? సెలబ్రెటీలకు సామాన్యుడికి ఎప్పుడూ ఈ పక్షపాతం ఎందుకు? అంటూ ఎక్స్ లో ట్వీట్ చేశాడు. మరి దీనిపై వీసీ సజ్జనార్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
Youtubers: వారు అరెస్టు.. వీరు అలర్ట్! తప్పైంది.. క్షమించమంటున్న ముద్దుగుమ్మ