Singham Agian Trailer | మూడో ‘సింగం’ ట్రైలర్ వచ్చేసింది.. దుమ్ము లేపేసింది…!
సింగం… తమిళ, తెలుగు, హిందీలలో అద్భుత విజయ సాధించిన ఫ్రాంచైజీ. హిందీలో మొదటి భాగం తమిళ రీమేక్ అయినా, తర్వాత వచ్చినవి మాత్రం పూర్తిగా దర్శకుడు రోహిత్ శెట్టి సృష్టే. ఇప్పుడు సింగం 3 గా వస్తున్న సింగం అగైన్ ట్రైలర్ విడుదలైంది.

Singham 3 – బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి (Rohit Shetty), అజయ్ దేవ్‌గణ్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం సింగం అగైన్ (Singham Agian). బ్లాక్ బస్టర్ ‘సింగం’(Singham) ఫ్రాంచైజీకి బాలీవుడ్‌లో ప్రత్యేక అభిమాన సంఘమే ఉంది. అజయ్ దేవ్‌గణ్ హీరోగా వచ్చిన ఈ సినిమాలు భారీ విజయాలు సాధించాయి. దీంతో రోహిత్ శెట్టి ఏకంగా ఓ కాప్ యూనివర్స్(Cop Universe)ను సృష్టించాడు. అజయ్ దేవ్‌గణ్‌తో సింగం, రణ్వీర్ సింగ్‌తో సింబా(Simbaa), అక్షయ్‌కుమార్‌తో సూర్యవంశీ(Suryavamshi).. ఇదీ శెట్టి కాప్ యూనివర్స్. అందులో భాగంగా ఇప్పుడు సింగం 3గా వస్తున్న ‘సింగం అగైన్’ ట్రైలర్ విడుదలైంది.
‘సింగం అగైన్’ అంటూ వస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. కరీనా కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాను దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్‌ను వదిలారు. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందించినట్లు ట్రైలర్‌తోనే తెలిసిపోతోంది. ఇక యాక్షన్ పార్టయితే మామూలుగా లేదు. భారీ స్టార్ కాస్ట్‌తో బీభత్సమైన యాక్షన్‌తో రోహిత్ శెట్టి ఎక్కడా తగ్గలేదు ఈ మూవీలో దీపికా పదుకొనే, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్, జాకీ ష్రాఫ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
శెట్టి కాప్ యూనివర్స్ హీరోలు రణ్వీర్ సింగ్, అక్షయ్‌కుమార్ కూడా ఇందులో భాగమయ్యారు. ముగ్గురు హీరోలు విలన్ చెరలో ఉన్న కథానాయిక కోసం చేసే పోరాటమే ఈ సినిమా. ట్రైలర్ మాత్రం అదిరిపోయిందంతే. తొందరగా చూసేయండి మరి..!