Kalki 2898 AD| ప్రభాస్ కోసం కదిలి వస్తున్న చంద్రబాబు, పవన్.. అభిమానులకి కన్నుల పండగే..!
Kalki 2898 AD| యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం కల్కి 2898 AD. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నాగ్ అశ్విన్ తెరకెక్కించారు. జూన్ 27న మూవీ విడుదలకి ప్లాన్ చేయగా, ప్రమోషన్స్ వేగవంతం చేశారు. రీసెంట్‌గా విడుదలైన తొలి పాట కూడా నెటిజన్స్‌ని ఆకట్టుకుంది. కల్కి కోసం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌ను వేర్వేరుగా కల్కి యూని

Kalki 2898 AD| యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం కల్కి 2898 AD. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నాగ్ అశ్విన్ తెరకెక్కించారు. జూన్ 27న మూవీ విడుదలకి ప్లాన్ చేయగా, ప్రమోషన్స్ వేగవంతం చేశారు. రీసెంట్‌గా విడుదలైన తొలి పాట కూడా నెటిజన్స్‌ని ఆకట్టుకుంది. కల్కి కోసం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌ను వేర్వేరుగా కల్కి యూనిట్ ప్లాన్ చేసినట్లుగా కూడా సమాచారం అందుతుంది. ఏపీలో కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తే, ఆ వేడుకకి ఏపీ సీఏం చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ హాజరుకానున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీఏం, డిప్యూటీ సీఏం హోదాలో వీరిద్దరు హాజరుకానున్న తొలి సినిమా వేడుక ఇదేనని అంటున్నారు.
కల్కి ప్రొడ్యూసర్ అశ్వనీదత్‌తో చంద్రబాబుకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఆ అనుబంధంతోనే చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కల్కి ప్రీ రిలీజ్ వేడుకకు గెస్ట్‌లుగా రాబోతున్నట్లు సమాచారం. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వేదికగా పిఠాపురం, అమరావతి, వైజాగ్‌తో పాటు మరికొన్ని సిటీలను పరిశీలిస్తోన్నట్లు చెబుతున్నారు. చంద్రబాబు, పవన్ డేట్స్‌తో పాటు వేదిక ఫైనల్ చేసిన తర్వాతే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి సంబంధించిన క్లారిటీ ఇవ్వనున్నారు. ఎవరూ ఊహించని స్థాయిలో గ్రాండ్‌గా ఈ ఈవెంట్‌ను నిర్వహించాలని నిర్మాత అశ్వినీదత్ భావిస్తున్నరు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్‌లను కూడా అశ్వినీదత్ ఆహ్వానిస్తున్నారని టాక్. విశ్వనటుడు కమల్ హాసన్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఈవెంట్‌కి రానుండడంతో అభిమానులకి ఫుల్ ఫీస్ట్ అందడం ఖాయంగా చెప్పవచ్చు.
ఈ బుధవారం (జూన్ 20న)ముంబైలో కల్కి ఈవెంట్‌ను భారీగా నిర్వహించబోతున్నట్టు కూడా ఓ టాక్ వినిపిస్తుంది. ఈ ఈవెంట్‌లో ప్రభాస్ తో పాటు అమితాబ్‌బచ్చన్, దీపికా పదుకోణ్, దిశాపటానీ పాల్గొననున్నారని సమాచారం. ఇక కల్కి తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమాలు క్యూ కట్టనున్నాయి. ఈ ఏడాది కల్కితో పాటు రాజా సాబ్ సినిమా కూడా రిలీజ్ కాబోతోంది. రాజాసాబ్ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తోన్నాడు. మరోవైపు సలార్ మూవీ సీక్వెల్ చేయబోతున్నాడు ప్రభాస్. సలార్ 2 శౌర్యంగపర్వం పేరుతో రూపొందుతోన్న ఈ మూవీ ఈ ఏడాదే సెట్స్‌పైకి వెళ్లనుండగా, ఈ మూవీతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ లవ్ స్టోరీ చేయనున్నాడు ప్రభాస్