Chiranjeevi|ఠాగూర్ 2.0కి రెడీ అవుతున్న చిరంజీవి.. దర్శకుడు ఎవరంటే..!
Chiranjeevi|మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ చిత్రాలలో ఠాగూర్ చిత్రం ఒకటి. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కిన ఈ సినిమా మెగా అభిమానులకు సైతం ఎంతో ఇష్టమైన సినిమా అని చెప్పడంలో ఎలాం

Chiranjeevi|మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ చిత్రాలలో ఠాగూర్ చిత్రం ఒకటి. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కిన ఈ సినిమా మెగా అభిమానులకు సైతం ఎంతో ఇష్టమైన సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.రమణ అనే తమిళ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్‌గా ఓ మూవీని తీసుకొచ్చేపనిలో ఉన్నారట చిరంజీవి. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న విశ్వంభర చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో మెగాస్టార్ మూవీకి సంబంధించిన డిస్కషన్ మొదలైంది.
ఇదే క్రమంలో చిరంజీవి తదుపరి సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు రచయిత బీవీఎస్ రవి. బాక్సాఫీస్‌ను షేక్ చేసే మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు మెగాస్టార్ రెడీ అవుతున్నారన్న హింట్ ఇచ్చారు. చిరు కోసం మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న మెసేజ్ ఓరియంటెడ్ కథను సిద్ధం చేసినట్టుగా ఆయన చెప్పా. ఇప్పటికే ఆ కథని చిరు వినడంతో పాటు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారట. ఠాగూర్ తరువాత మరోసారి ఆ రేంజ్ కథ కావటంతో దర్శకుడిగా ఎవరిని తీసుకోవాలన్న విషయంలో కాస్త సందిగ్ధంలో ఉన్నారట చిరు. ఇప్పటికే చిరుకి ఠాగూర్, ఖైదీ నెంబర్ 150 లాంటి రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన వివి వినాయక్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
చిరు ఇమేజ్‌ను డీల్ చేయటంతో పాటు.., తెలుగు ఆడియన్స్ పల్స్ అతనికి బాగా తెలియడంతో మళ్లీ వివి వినాయక్‌కే చిరు ఛాన్స్ ఇస్తారా అనే చర్చ మొదలైంది. మరోవైపు తమిళ దర్శకుడు మోహన్‌రాజా పేరు కూడా వినిపిస్తోంది. గాడ్ ఫాదర్ రిలీజ్ తరువాత మోహన్ రాజా దర్శకత్వంలో చిరు మరో మూవీ చేస్తారన్న టాక్ గట్టిగా వినిపించింది. ఇప్పుడు రాగూర్ 2.0లాంటి కథకి ఆయనే దర్శకత్వం వహించనున్నారని సమాచారం.మరి ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. ఇక మెగాస్టార్ విశ్వంభర చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి రావల్సి ఉండగా, కొన్ని కారణాల వలన మూవీని వాయిదా వేశారు.