Kantara Chapter 1‌‌ | నేటికి 685 కోట్ల వసూళ్లు : చిట్టచివరి ఎగ్జిబిటర్​ను కూడా లాభాల బాట పట్టించిన కాంతార 2

రిషబ్‌ శెట్టి హీరోగా నటించిన కాంతార చాప్టర్ 1 ప్రపంచవ్యాప్తంగా ₹685 కోట్ల గ్రాస్‌ సాధించింది. నిర్మాతలకు భారీ లాభాలు — హోంబలే ఫిలింస్‌‌కు డబ్బులే డబ్బులు

  • By: ADHARVA |    cinema |    Published on : Oct 15, 2025 7:00 AM IST
Kantara Chapter 1‌‌ | నేటికి 685 కోట్ల వసూళ్లు : చిట్టచివరి ఎగ్జిబిటర్​ను కూడా లాభాల బాట పట్టించిన కాంతార 2

Kantara Chapter 1‌‌ crosses ₹685 crore worldwide — enters profit zone for all

బెంగళూరు:

Kantara Chapter 1‌‌ | హోంబలే ఫిలింస్‌ నిర్మించిన కాంతార చాప్టర్ 1 కలెక్షన్ల జోరు కొనసాగుతోంది. అక్టోబర్‌ 2న విడుదలైన ఈ చిత్రం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ₹685 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. అయితే, 13వ రోజు నుండి సినిమా బుకింగ్స్‌ కొంత తగ్గినట్లు ట్రేడ్‌ వర్గాలు వెల్లడించినా, బిజినెస్​పరంగా చిన్న ఎగ్జిబిటర్​కు కూడా లాభాలు మొదలైనట్లు సమాచారం.

రిషబ్‌ శెట్టి హీరోగా, దర్శకుడిగా తెరకెక్కిన ఈ చిత్రం పాన్‌-ఇండియా స్థాయిలో బాక్సాఫీస్‌పై ప్రభావం చూపుతోంది. రుక్మిణీ వసంత్‌, జయరామ్‌, గుల్షన్‌ దేవయ్య వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటించగా, అజనీష్‌ లోకనాథ్‌ సంగీతం, అరవింద్‌ కశ్యప్‌ సినిమాటోగ్రఫీ, సురేష్‌ మల్లయ్య ఎడిటింగ్‌ బాధ్యతలు నిర్వర్తించారు.

కాంతార 2 బడ్జెట్‌ ఎంత? ప్రీ-రిలీజ్‌ బిజినెస్‌ ఎంత చేసింది?

కాంతార చాప్టర్ 1 మొత్తం బడ్జెట్‌ సుమారు ₹125 కోట్లు కాగా, మార్కెటింగ్‌ ఖర్చులతో కలిపి “ల్యాండింగ్‌ కాస్ట్‌” ₹150 కోట్లకు చేరినట్లు హిందుస్తాన్‌టైమ్స్‌ కథనం తెలియజేసింది.  కానీ నిర్మాతలు డిజిటల్‌, టీవీ, మ్యూజిక్‌ హక్కులను ₹200 కోట్లకు పైగా అమ్మగలిగారు. అంటే..అక్కడే వారికి 50 కోట్ల లాభం వచ్చింది.  ఇక థియేటర్ల పంపిణీ హక్కులు దేశవ్యాప్తంగా ₹350 కోట్లకు పైగా అమ్ముడయ్యాయి. ఆ విధంగా కాంతార 2, విడుదలకు ముందే నిర్మాతలైన హోంబలే ఫిల్మ్స్​కు 400 కోట్ల రూపాయలకు పైగా లాభాలను తెచ్చిపెట్టింది.

సినీ వ్యాపార విశ్లేషకుల అంచనా ప్రకారం, అందరు డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు లాభాలు రావాలంటే కనీసం ₹550 కోట్ల నెట్‌ కలెక్షన్లు అవసరం. 12 రోజులకే సినిమా ₹540 కోట్ల గ్రాస్‌ , ₹452 కోట్ల నెట్‌ రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో ₹96 కోట్ల వసూళ్లతో కలిపి వరల్డ్‌వైడ్‌గా ₹640 కోట్ల గ్రాస్‌ దాటింది. అంటే 550 కోట్ల నెట్​ వసూళ్ల బెంచ్​మార్క్​ దాటి, అందరినీ లాభాల బాట పట్టించింది. ఇక 13వ రోజైన 14 అక్టోబర్​ నుండి వచ్చే ప్రతీ పైసా, ఆ సినిమాకు సంబంధించిన ప్రతీ డిస్ట్రిబ్యూటర్​, ఎగ్జిబిటర్​కు లాభాల కిందే లెక్క.

13వ రోజు కాంతార 2 కలెక్షన్ల పరిస్థితి

వర్కింగ్‌ డే కావడంతో బుకింగ్స్‌ తగ్గినా, సోమవారం రోజున దేశవ్యాప్తంగా ₹13.3 కోట్ల గ్రాస్‌ వసూలు చేయగా, మంగళవారం (13వ రోజు – 13.5 కోట్లు) వరకు ప్రపంచవ్యాప్తంగా ₹685 కోట్ల గ్రాస్‌ మార్క్‌ చేరింది. కన్నడలో ₹4 కోట్ల, హిందీలో ₹6 కోట్ల, తెలుగులో ₹2 కోట్ల, తమిళం-మలయాళం సహా మిగతా ప్రాంతాల్లో ₹3 కోట్ల వరకు రాబట్టినట్లు ఫిల్మ్​ ట్రేడ్​ పోర్టల్​  సాక్‌నిక్‌.కామ్​ అంచనా వేసింది.

భారీ లాభాల్లో రిషబ్‌ శెట్టి మూవీ

హిందుస్తాన్‌టైమ్స్‌ విశ్లేషణ ప్రకారం, కాంతార చాప్టర్ 1 నిర్మాతలు ఇప్పటికే భారీ లాభాల్లో ఉన్నారు. ప్రీ-రిలీజ్‌ రికవరీస్‌, థియేట్రికల్‌ వసూళ్లు కలిపి హోంబలే ఫిలింస్‌కు 200 శాతం కంటే ఎక్కువ రిటర్న్‌ వచ్చినట్లు పేర్కొంది. డిస్ట్రిబ్యూటర్లకు పూర్తి లాభం రావాలంటే ₹550–₹600 కోట్ల నెట్‌ అవసరమని, ఆ లక్ష్యం కూడా సులభంగా సాధ్యమని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ రకంగా పంపిణీదారులు, ప్రదర్శకులు కూడా భారీ లాభాలు ఆర్జించే దిశగా కాంతార చాప్టర్ 1  పయనిస్తోంది.​

ప్రస్తుత కలెక్షన్​ ట్రెండ్​  కొనసాగితే, కాంతార చాప్టర్ 1 వచ్చే వారంలోనే ₹700 కోట్ల క్లబ్‌లో చేరి, ఈ సంవత్సరంలోని అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.