Kantara 3 | ‘కాంతార-3’లో జూనియర్ ఎన్టీఆర్…?
జూనియర్ ఎన్టీఆర్ 'కాంతార-3'లో కీలక అతిథి పాత్రలో కనిపించబోతున్నారనే వార్త ఫ్యాన్స్ లో ఆసక్తి రేపుతోంది. అధికారిక ప్రకటనే మిగిలింది.

Kantara 3 | విధాత : రిషబ్ శెట్టి హీరోగా స్వీయా దర్శకత్వంలో వచ్చిన హిట్ మూవీ ‘కాంతార’ కు ప్రీక్వేల్ గా వస్తున్న ‘కాంతార చాప్టర్ 1’ సినిమాకు సీక్వెల్ గా కాంతార -3 కూడా రాబోతుందన్న సమాచారం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. మరి ముఖ్యంగా ‘కాంతార -3’లో జూనియర్ ఎన్టీఆర్ ను ఓ కామియో(కథకు కీలకమైన అతిధి పాత్ర) పాత్రకు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లుగా వెలువడిన సమాచారం ఈ సినిమాపై మరింత ఆసక్తికరంగా మారింది. అయితే ‘కాంతార-3’లో జూనియర్ ఎన్టీఆర్ కామియోపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. కాంతార -3 నిర్మాణం కోసం ఇప్పటికే రిషబ్ శెట్టికి, నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్ కు మధ్య ఒప్పందాలు కుదిరాయి. ప్రస్తుతం రిషబ్ శెట్టి నటిస్తున్న సినిమాలు అన్ని పూర్తయ్యాక ‘కాంతార-3’ నిర్మాణం ఉంటుందని సమాచారం.
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందిన కాంతార చిత్రం భారీ విజయం సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీక్వెల్ కాంతార చాప్టర్ 1 షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. కాంతార చాప్టర్ 1 ఆక్టోబర్ 2న విడుదల కానుంది.