KTR| అరెస్టుకు భయపడను : కేటీఆర్
ఫార్ములా ఈ కారు రేసు కేసులో దసరా తర్వాత కేటీఆర్ అరెస్టు ఉండవచ్చన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. అరెస్టుకు భయపడేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు

విధాత, హైదరాబాద్ : ఫార్ములా ఈ కారు రేసు కేసులో(Formula E race case) నన్ను అరెస్టు చేయాలని కాంగ్రెస్ పాలకులు కలలు కంటున్నారని..నేను అరెస్టుకు(Arrest) భయపడేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫార్ములా ఈ కారు రేసు కేసులో దసరా తర్వాత కేటీఆర్ అరెస్టు ఉండవచ్చన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలపై స్పందించారు. ఫార్ములా ఈ రేస్ కేసులో నేను ఏ తప్పూ చేయలేదన్నారు. పదేళ్లు మంత్రిగా ఉన్న నేను ఎంత ధైర్యముంటే లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం అని సవాల్ చేస్తానన్నారు. అరెస్ట్ చేయాలనుకుంటే చేసుకోండి అన్నారు.
లగ్జరీ కార్ల కేసులోనూ విచారణకు సిద్ధం అన్నారు. లగ్జరీ కార్లు కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన ఆరోపణలను కేటీఆర్ ఖండించారు. ఎస్ఆర్ బ్రదర్స్(బండి సంజయ్..రేవంత్ రెడ్డి)లకు నా అరెస్టు కోసం ఆతృత పడుతున్నారంటూ సెటైర్లు వేశారు.