Telangana | ప్రాణాలు పోతున్న పైసలు ఇవ్వరా? రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి

Telangana | రిటైర్డు ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించాల్సిన రిటైర్‌మెంట్ బకాయిలను 18 నెలలు గడిచినా చెల్లించకపోవడం దారుణమని తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయిస్ బకాయిల సాధన కమిటీ ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

  • By: raj |    telangana |    Published on : Oct 15, 2025 6:45 AM IST
Telangana | ప్రాణాలు పోతున్న పైసలు ఇవ్వరా? రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి

జిల్లా కలెక్టర్ల కు వినతి పత్రాలు అందజేత

Telangana | విధాత, వరంగల్ ప్రతినిధి: రిటైర్డు ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించాల్సిన రిటైర్‌మెంట్ బకాయిలను 18 నెలలు గడిచినా చెల్లించకపోవడం దారుణమని తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయిస్ బకాయిల సాధన కమిటీ ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం వరంగల్, హనుమకొండ జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు శ్రీదర్ల ధర్మేంద్ర, ప్రధాన కార్యదర్శి కడారి భోగేశ్వర్, అసోసియేట్ అధ్యక్షుడు కందుకూరి దేవదాసు, గౌరవ అధ్యక్షుడు యం.చంద్రమౌళి, జాయింట్ సెక్రెటరీలు ఎం.డి. అబ్దుల్ గఫార్, ఎం. దామోదర్ మాట్లాడారు. పెన్షనర్లను మానసికంగా వేధించడం సరైంది కాదని అన్నారు. మార్చి 2024 నుండి సెప్టెంబర్ 2025 వరకున్న పెన్షనర్ల బకాయిలన్నింటినీ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పెన్షనర్లు పిల్లల పెండ్లిళ్లు చేయలేక, ఇల్లు కట్టుకోలేక, చేసిన అప్పులు తీర్చలేక, బ్యాంకు ఈఎంఐలు చెల్లించలేక వృద్ధ తల్లి దండ్రులను చూసు కోలేక ఇబ్బందులకు గురవెతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 16 మంది రిటైర్‌మెంట్ బకాయిలు రాకపోవడంతో బాధతో, చనిపోయారన్నారు. ఇప్పటివరకు దాదాపుగా 11వేల మంది రిటైర్డ్ అయ్యారు.. వీరికి18 నెలల నుండి బకాయిలు చెల్లించలేని కారణంగా ఇబ్బందులపాలవుతున్నారన్నారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి బకాయిలు, పీఆర్సీ 2020 ఏరియర్స్, డీఏ ఏరియర్స్, జీపీఎఫ్, బిల్లులు లీవ్ ఇన్ క్యాష్ మెంట్ తదితర వాటిని చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఇంద్రసేనారెడ్డి, కిషన్ నాయక్, కుమారస్వామి, ఆర్ వి చలం , అశోక్, శ్రీనివాస్, రాజి రెడ్డి, సారయ్య, రాజేందర్, శ్యామ్ రావు, మహేందర్ రావు, సంజీవరెడ్డి, కృష్ణమూర్తి, సంజీవ రావు, వాసుదేవ మూర్తి, కుమార స్వామి తదితరులు పాల్గొన్నారు.