Chiranjeevi| ఎయిర్ పోర్ట్ సిబ్బందిని తోసేయ‌డంతో చిరంజీవిపై విమ‌ర్శ‌లు.. నాగార్జున మాదిరిగా సారీ చెబుతారా..!

Chiranjeevi| మెగాస్టార్ చిరంజీవి పెద్ద‌గా వివాదాల జోలికి పోరు. ఆయ‌న ప‌బ్లిక్‌లోకి వ‌చ్చిన‌ప్పుడు చాలా హుందాగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు.ఈ క్ర‌మంలో చిరంజీవిని సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ చేయ‌డం చాలా త‌క్కువ‌గా చూస్తుంటాం. అయితే తాజాగా ఆయ‌న చేసిన ప‌ని ఎవరికి న‌చ్చ‌క‌పోవ‌డంతో తెగ ట్రోల్ చేస్తున్నారు. చిరు త‌న ఫ్యామిలీతో క‌లిసి గ‌త వారం రోజులుగా పారిస్‌లో ఎంజాయ్ చేయ‌డం మ‌నం చూసాం. భార్య సురేఖ, రామ్‌ చరణ్‌,

  • By: sn    cinema    Jul 31, 2024 7:57 AM IST
Chiranjeevi| ఎయిర్ పోర్ట్ సిబ్బందిని తోసేయ‌డంతో చిరంజీవిపై విమ‌ర్శ‌లు.. నాగార్జున మాదిరిగా సారీ చెబుతారా..!

Chiranjeevi| మెగాస్టార్ చిరంజీవి పెద్ద‌గా వివాదాల జోలికి పోరు. ఆయ‌న ప‌బ్లిక్‌లోకి వ‌చ్చిన‌ప్పుడు చాలా హుందాగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు.ఈ క్ర‌మంలో చిరంజీవిని సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ చేయ‌డం చాలా త‌క్కువ‌గా చూస్తుంటాం. అయితే తాజాగా ఆయ‌న చేసిన ప‌ని ఎవరికి న‌చ్చ‌క‌పోవ‌డంతో తెగ ట్రోల్ చేస్తున్నారు. చిరు త‌న ఫ్యామిలీతో క‌లిసి గ‌త వారం రోజులుగా పారిస్‌లో ఎంజాయ్ చేయ‌డం మ‌నం చూసాం. భార్య సురేఖ, రామ్‌ చరణ్‌, ఉపాసన, మనవరాలు క్లీంకారతో కలిసి పారిస్‌ అందాలను ఆస్వాధించడమే కాక‌ ఒలంపిక్ గేమ్స్ కూడా తిలకించారు. పీవీ సింధుని క‌లిసి ఆమెతో కూడా తెగ సంద‌డి చేశారు.

అయితే పారిస్ టూర్ పూర్తి చేసుకున్న చిరంజీవి హైద‌రాబాద్‌లో అడుగుపెట్టారు. చిరంజీవి ఎయిర్‌పోర్ట్ లో నుండి బ‌య‌ట‌కు వెళుతున్న స‌మ‌యంలో ఎయిర్ పోర్ట్ స్టాఫ్ ఫొటో దిగేందుకు ప్ర‌య‌త్నించాడు. ముందు లిఫ్ట్‌లో నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన స‌మ‌యంలో చిరుతో సెల్ఫీ దిగేందుకు ప్ర‌య‌త్నించాడు. అది కుద‌ర‌క‌పోవ‌డంతో మ‌ళ్లీ చిరుతో ముందుకు వెళ్లాడు. అయితే త‌న‌కు ఎదురుగా ఆ వ్య‌క్తి ఉండ‌డంతో ప‌క్క‌కి తోసేసి త‌న దారిలో వెళ్లాడు చిరంజీవి. ఆ స‌మ‌యంలో చిరంజీవి బ్లాక్ గ్లాసెస్ ధ‌రించి ఉన్నారు. అయితే ఎయిర్ పోర్ట్ సిబ్బందిని చిరు ప‌ట్టించుకోవ‌డ‌మే కాక ఏకంగా ఆయ‌నే తోసేయ‌డంతో ఇప్పుడు దీనిని కొంద‌రు విమ‌ర్శిస్తున్నారు.

మొన్న ఆ మ‌ధ్య నాగార్జున కూడా ఇలానే ఎయిర్‌ పోర్ట్ లో నుండి వస్తుండగా, ఆయన‌తో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన ఎయిర్‌పోర్ట్ సిబ్బందిని సెక్యూరిటీ వాళ్లు పక్కకి లాగేశారు. అందులో నాగ్ త‌ప్పులేక‌పోయిన కూడా ట్రోల్ చేశారు. మ‌రి ఇప్పుడు చిరంజీవి స్వ‌యంగా ఆయ‌న చేతుల‌తో ప‌క్క‌కి నెట్టేశాడు. దీనిపై ఏమంటారు? అని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి ఈ వివాదంపై చిరంజీవి ఏమైన స్పందిస్తాడా లేదా అనేది చూడాల్సి ఉంది. ఇక చిరు ప్ర‌స్తుతం `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ కాగా, మీనాక్షి చౌదరి, సురభి, మృణాల్‌ ఠాకూర్‌, ఇషా చావ్లా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న ఈ మూవీ సోషియో ఫాంటసీగా తెరకెక్కుతుంది.