Chiranjeevi:చంద్ర‌బాబుకి బ‌ర్త్ డే విషెస్ తెలిపిన చిరంజీవి…ట్విటర్ ట్రెండింగ్‌లో హ్యాపీ బర్త్ డే చంద్రబాబు హ్యాష్ ట్యాగ్..

Chiranjeevi: టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఈ రోజు త‌న 75వ పుట్టిన రోజు వేడుక జ‌రుపుకుంటున్నారు. చంద్ర‌బాబు బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆయ‌న వేడుక‌ల‌ని టీడీపీ అభిమానులు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.ఇక ట్విటర్ వేదికగా చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నా

  • By: sn    cinema    Apr 20, 2024 4:42 PM IST
Chiranjeevi:చంద్ర‌బాబుకి బ‌ర్త్ డే విషెస్ తెలిపిన చిరంజీవి…ట్విటర్ ట్రెండింగ్‌లో హ్యాపీ బర్త్ డే చంద్రబాబు హ్యాష్ ట్యాగ్..

Chiranjeevi: టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఈ రోజు త‌న 75వ పుట్టిన రోజు వేడుక జ‌రుపుకుంటున్నారు. చంద్ర‌బాబు బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆయ‌న వేడుక‌ల‌ని టీడీపీ అభిమానులు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.ఇక ట్విటర్ వేదికగా చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వున్న చంద్రబాబు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు, తెలుగు ప్రజలు ట్విటర్ వేదికగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ట్విటర్‌లో HBDBabu హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం చంద్ర‌బాబు కుప్పం పర్యటనలో ఉండ‌గా, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఆమె క్యాంప్ సైట్‌లో ఘనంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకను నిర్వహించారు.

తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ నాయకులంతా తమ అభిమానాన్ని చంద్రబాబుపై పెద్ద ఎత్తున కురిపిస్తూ శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. చంద్ర‌బాబు పుట్టిన రోజుసంద‌ర్భంగా అన్న‌దానం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైకిల్ ర్యాలీలు, అన్న దానాలు వంటివి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇక చంద్ర‌బాబుకి చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా గ్రీటింగ్స్ తెలిపారు. ‘అహర్నిశం ప్రజల మధ్య ఉంటూ… ప్రజా సంక్షేమం కోసం పాటుపడే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలను ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.

ఎక్స్ వేదికగా పవన్ కల్యాణ్ స్పందిస్తూ… ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రాజకీయంగా, పాలనాపరంగా అనుభవజ్ఞులైన చంద్రబాబు గారు నిరంతరం రాష్ట్రం గురించే ఆలోచిస్తారు. రాజకీయ ఒత్తిళ్లు, వేధింపులు ఎన్ని ఎదురైనా ధృడ చిత్తంతో ఎదుర్కొంటారు. వైసీపీ సర్కార్ బనాయించిన కేసులతో జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన మనో నిబ్బరం కోల్పోలేదు. పరిపాలన పటిమతో రాష్ట్ర అభివృద్ధి కోసం దూరదృష్టితో ఆలోచన చేసే నాయకుడు చంద్రబాబు గారు. ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సంతోషాలు ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.