V Kaveri Travels | వి కావేరి బస్సు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
V Kaveri Travels | వి కావేరి ట్రావెల్స్ బస్సు( V Kaveri Travels ) ప్రమాద ఘటన ఓ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. అగ్నికీలల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కాలి బూడిదయ్యారు. దీంతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
V Kaveri Travels | హైదరాబాద్ : వి కావేరి ట్రావెల్స్ బస్సు( V Kaveri Travels ) ప్రమాద ఘటన ఓ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. అగ్నికీలల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కాలి బూడిదయ్యారు. దీంతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గోళ్లవారిపల్లికి చెందిన గోళ్ల రమేశ్ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వి కావేరి ట్రావెల్స్ బస్సులో బయల్దేరారు. రాత్రి బస్సులో చెలరేగిన మంటలకు నలుగురు సజీవదహనం అయ్యారు. మృతులను గోళ్ల రమేశ్ (35), భార్య అనూష (32), కుమారుడు యశ్వంత్(8), కూతురు మన్విత(6)గా పోలీసులు గుర్తించారు.
రమేశ్ కుటుంబం బెంగళూరులో స్ధిరపడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హైదరాబాద్ వెళ్లి తిరిగి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు పేర్కొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram