Committee Kurrollu|బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతున్న నిహారిక కమిటీ కుర్రోళ్లు..ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!
Committee Kurrollu|నటిగా నిహారికకి ఒక్క సక్సెస్ కూడా లేదు. దీంతో నిర్మాతగా ప్రేక్షకులని అలరించేందుకు గాను కమిటీ కుర్రోళ్లు అనే చిత్రం చేసింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ఎల్పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రంలో 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్

Committee Kurrollu|నటిగా నిహారికకి ఒక్క సక్సెస్ కూడా లేదు. దీంతో నిర్మాతగా ప్రేక్షకులని అలరించేందుకు గాను కమిటీ కుర్రోళ్లు అనే చిత్రం చేసింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ఎల్పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రంలో 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్ నటించారు. యదు వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 9న విడుదలై పెద్ద విజయం సాధించింది.గోదావరి జిల్లా నేపథ్యంగా స్థానిక రాజకీయాలు, కులాల బ్యాక్ డ్రాప్‌తో ఈ చిత్రాన్ని చాలా అత్యద్భుతంగా నిర్మించింది నిహారిక. సుమారుగా 6 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ చిత్రం దాదాపు 8 కోట్ల షేర్ బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ యాత్రను కొనసాగించింది. ఇప్పటికే రెండు వారాల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకొని విజయవంతంగా మూడవ వారంలో అడుగుపెట్టింది.
రెండు వారాల్లోనే కమిటీ కుర్రోళ్లు చిత్రం 15.6 కోట్ల గ్రాస్ ను రాబట్టి అదరగొట్టింది. అదే జోష్ మూడవ వారంలోనూ కొనసాగే అవకాశం ఉంది. మూడో వారంలో ఈ చిత్రానికి మరిన్ని స్క్రీన్స్ యాడ్ చేస్తుండగా.. వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో విడుదలైన మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ వంటి పెద్ద సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోవడంతో ఇప్పుడు అందరు కూడా కమిటీ కుర్రోళ్లు సినిమాని చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా కమిటీ కుర్రోళ్ళు సినిమా ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్ అయినట్టు సమాచారం బయటికి వచ్చింది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రాన్ని మంచి ధరకే ఆహా తీసుకుందని టాక్. ఈ సినిమాకు ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతోంది. సెప్టెంబర్‌లో కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆహా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. ఓటీటీ ప్లాట్‍ఫామ్‍పై త్వరలోనే అధికారిక ప్రకటన రావొచ్చు.
కమిటీ కుర్రోళ్లు చిత్రంలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ప్రసాద్ బెహరా, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, మణికంఠ పరసు, లోకేశ్ కుమార్ పరిమి, శ్యామ్ కల్యాణ్, అక్షయ్ శ్రీనివాస్, టీనా శ్రావ్య, శివకుమార్, తేజస్వి రావ్, విశిక కీలకపాత్రలు పోషించారు. కామెడీతో పాటు 1990ల జ్ఞాపకాలను గుర్తుచేయడం, స్నేహితుల మధ్య బంధం, గోదావరి పల్లె వాతావరణాన్ని ఆకట్టుకునేలా చూపించడం ప్రేక్షకులకి బాగా నచ్చాయి. ఈ సినిమాకు అనుదీప్ దేవ్ సంగీతం అందించారు. ఈ సినిమా కోసం నిర్మాత నిహారిక కొణిదెల సహా మూవీ టీమ్ సభ్యులు జోరుగా ప్రమోషన్లు చేశారు. మూవీ మంచి విజయం సాధించడంతో మెగాస్టార్ చిరంజీవి, దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్, నేచురల్ స్టార్ నాని సహా మరికొందరు టాలీవుడ్ సెలబ్రిటీలు తమ శుభాకాంక్షలు తెలియజేశారు.