Owaisi Third Front Bihar | బీహార్​లో ఒవైసీ రెండు పార్టీల మూడో కూటమి – గ్రాండ్ డెమోక్రటిక్ అలయన్స్

బీహార్ ఎన్నికల రేసులో థర్డ్ ఫ్రంట్‌గా ఎంఐఎం రంగప్రవేశం చేసింది. ఒవైసీ నేతృత్వంలో గ్రాండ్ డెమోక్రటిక్ అలయన్స్ పేరుతో ఆజాద్ సమాజ్ పార్టీ, అప్నీ జనతా పార్టీ కూటమి ఏర్పడింది. మొత్తం 64 స్థానాల్లో పోటీకి సిద్ధమైంది.

Owaisi Third Front Bihar | బీహార్​లో ఒవైసీ రెండు పార్టీల మూడో కూటమి – గ్రాండ్ డెమోక్రటిక్ అలయన్స్

Owaisi forms ‘Third Front’ in Bihar with Aazad and Maurya | AIMIM announces 32-seat plan

(విధాత ఎలక్షన్​ డెస్క్​)
పట్నా:
Owaisi Third Front Bihar|బీహార్‌ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ నూతన రాజకీయ కూటమి ఏర్పాటును ప్రకటించారు. ‘గ్రాండ్ డెమోక్రటిక్ అలయన్స్’ పేరుతో ఆజాద్ సమాజ్ పార్టీ, అప్నీ జనతా పార్టీతో చేతులు కలిపి థర్డ్ ఫ్రంట్ గా బీహార్ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు వెల్లడించారు.

ఎంఐఎం బీహార్‌ అధ్యక్షుడు అఖ్తరుల్ ఇమాన్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ కూటమిలో ఎంఐఎం 35, ఆజాద్ సమాజ్ పార్టీ 25, అప్నీ జనతా పార్టీ నాలుగు స్థానాల్లో పోటీ చేయనున్నాయి. మొత్తం 64 నియోజకవర్గాల్లో పోటీ చేయనున్న ఈ కూటమి, 16 జిల్లాలను కవర్ చేస్తుంది. 17న నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ కావడంతో, గురువారం సాయంత్రానికి అభ్యర్థుల పూర్తి జాబితా విడుదల కానుంది.

మహాకూటమిలో చేరడానికి అవకాశం లభించకపోవడంతో ఒవైసీ స్వతంత్ర రాజకీయ శక్తిగా బీహార్‌లో బరిలోకి దిగారు. థర్డ్ ఫ్రంట్ రూపంలో ఏర్పడిన ఈ కూటమి, దళితులు, మైనారిటీలకు న్యాయం చేయడమే లక్ష్యమని అఖ్తరుల్ ఇమాన్ పేర్కొన్నారు. “20 శాతం దళిత జనాభా, 18 శాతం మైనారిటీలు, ఇతర వెనుకబడిన వర్గాలు ఇప్పటివరకు నిర్లక్ష్యానికి గురయ్యాయి” అని ఆయన తెలిపారు.

ముస్లిం ఓటు బ్యాంక్ విభజనతో మహాకూటమి గెలుపుపై ప్రభావం పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం 20 స్థానాల్లో పోటీ చేసి ఐదు చోట్ల విజయం సాధించిన విషయం గమనార్హం. ఇప్పుడు గ్రాండ్ డెమోక్రటిక్ అలయన్స్ ద్వారా మరింత ప్రభావాన్ని సాధించాలనే లక్ష్యంతో ఒవైసీ ముందడుగు వేశారు.


AIMIM chief Asaduddin Owaisi has announced a new political alliance in Bihar named the Grand Democratic Alliance, along with Chandrashekhar Aazad’s Azad Samaj Party and Swami Prasad Maurya’s Apni Janata Party. The alliance plans to contest 64 constituencies, aiming to represent Dalits, minorities, and backward communities. Political observers say this move may influence the Muslim vote and alter Bihar’s political balance.