Tejashwi Yadav : బీహార్ లో గెలుపు మాదే..ఎగ్జిట్ పోల్స్ తో మైండ్ గేమ్

బీహార్ ఎన్నికల్లో మహాకూటమి విజయం ఖాయమని, ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ మైండ్ గేమ్ మాత్రమేనని తేజస్వీ యాదవ్ అన్నారు.

Tejashwi Yadav : బీహార్ లో గెలుపు మాదే..ఎగ్జిట్ పోల్స్ తో మైండ్ గేమ్

న్యూఢిల్లీ : బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో మెజార్టీ సీట్లు కైవసం చేసుకుని అధికారంలోకి వస్తామని మహాకూటమి నేత తేజస్వీ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ పేరుతో ఎన్డీఏ మైండ్ గేమ్ ఆడుతుందని, అధికారులపై ఒత్తిడి కోసమే ఎగ్జిట్ పోల్స్ లెక్కలు అని విమర్శించారు. రెండు విడతలుగా జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లో ఓటర్లు ప్రభుత్వం మార్పు కోరుతూ ఉత్సాహంగా ఓట్లు వేశారని, పెరిగిన ఓటింగ్ శాతం మహాకూటమికి అనుకూలం అని పేర్కొన్నారు.

మాకు లభించిన ప్రజాదరణతో బీజేపీ, ఎన్డీఏ నాయకులకు చెమటలు పడుతున్నాయన్నారు.
ఎగ్జిల్ పోల్స్ ఫలితాలపై ప్రజల్లో ఆందోళన, ఆతృత స్పష్టంగా కనిపిస్తోందని.. ఎగ్జిట్ పోల్స్ నిజం చూపించవు, అధికారులు మీద ఒత్తిడి కోసం వాడతారు అని తేజస్వీ యాదవ్ ఆరోపించారు. ప్రజాభిప్రాయం మేరకు 14వ తేదీ వెల్లడయ్యే ఫలితాల్లో మా కూటమి ఘన విజయం సాధించబోతుందన్నారు.