Tollywood|బాక్సాఫీస్ బిగ్ ఫైట్.. ఒక్క పండ‌గ‌ని టార్గెట్ చేసిన స్టార్ హీరోలు.. ఎన్ని సినిమ‌లు విడుద‌లంటే..!

Tollywood| పండుగ‌ల‌ని, వీకెండ్స్‌ని టార్గెట్ చేసి నిర్మాత‌లు తమ సినిమాల‌ని విడుద‌ల చేస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే మ‌రి కొద్ది రోజుల‌లో ద‌స‌రా పండుగ రాబోతుంది. దాంతో స్టార్ హీరోలు ఈ పండ‌గ‌కి తమ సినిమాల‌ని రిలీజ్ చేసి మంచి వ‌సూళ్లు రాబ‌ట్టే ప‌నిలో ఉన్న‌ట్టుగా తెలుస్తుం

  • By: sn    cinema    Aug 21, 2024 2:09 PM IST
Tollywood|బాక్సాఫీస్ బిగ్ ఫైట్.. ఒక్క పండ‌గ‌ని టార్గెట్ చేసిన స్టార్ హీరోలు.. ఎన్ని సినిమ‌లు విడుద‌లంటే..!

Tollywood| పండుగ‌ల‌ని, వీకెండ్స్‌ని టార్గెట్ చేసి నిర్మాత‌లు తమ సినిమాల‌ని విడుద‌ల చేస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే మ‌రి కొద్ది రోజుల‌లో ద‌స‌రా పండుగ రాబోతుంది. దాంతో స్టార్ హీరోలు ఈ పండ‌గ‌కి తమ సినిమాల‌ని రిలీజ్ చేసి మంచి వ‌సూళ్లు రాబ‌ట్టే ప‌నిలో ఉన్న‌ట్టుగా తెలుస్తుంది. ప్ర‌స్తుతానికి ప‌లు సినిమాలు ద‌స‌రాని టార్గెట్ చేశాయి. దీంతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఈ సారి గ‌ట్టిపోటీ క‌నిపిస్తుంది. అయితే ఈ సారి ద‌స‌రాకి వ‌చ్చే సినిమాల‌లో అంద‌రి దృష్టి ర‌జ‌నీకాంత్ వెట్టైయాన్, సూర్య కంగువలపైనే ఉంది. రజనీకాంత్ నటిస్తున్న వెట్టైయాన్ మూవీ అక్టోబర్ 10న రిలీజ్ కానుంది.

సూర్య, బాబీ డియోల్ నటిస్తున్న కంగువ మూవీ కూడా అక్టోబర్ 10న రిలీజ్ కానుంది. ఇక హిందీలో రాజ్ కుమార్ రావ్ నటిస్తున్న విక్కీ విద్యా కా ఓ వాలా వీడియో మూవీ కూడా అక్టోబ‌ర్ 10కే రిలీజ్ కానుంది. కన్నడ స్టార్ ధృవ్ సర్జా నటిస్తున్న మార్టిన్ మూవీ అక్టోబర్ 11న రిలీజ్ కానుంది. ఆలియా భట్ నటిస్తున్న జిగ్రా మూవీ కూడా దసరా పండగ సమయంలోనే థియేటర్లలోకి వస్తోంది. తెలుగు సినిమాలు కూడా ద‌స‌రా బ‌రిలో పోటీ ప‌డేందుకు సిద్ధ‌మ‌య్యాయి. దేవ‌ర అక్టోబ‌ర్‌లో వ‌స్తుంద‌ని ముందుగా ప్ర‌కటించిన కూడా ప్రీపోన్ చేసి సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల చేసారు.సినిమా బాగుంటే దేవ‌ర సంద‌డి ద‌స‌రా వ‌ర‌కు కొన‌సాగ‌డం ఖాయం.

అయితే తమిళ్ సూపర్ స్టార్ రజినీ కాంత్ జైలర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకోగా, ఆ సినిమా తర్వాత ఇప్పుడు “వెట్టయాన్ ” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. టి.జె జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘వెట్టయాన్‌’ చేస్తుండ‌గా, ఇందులో మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ తో పాటు బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.అత్యంత భారీ బడ్జెట్ లో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఇక‌ తమిళ హీరో సూర్య న‌టిస్తున్న కంగువా చిత్రం కూడా ద‌స‌రా బ‌రిలో రానుండ‌గా, ఈ సినిమా కూడా ఇంట్రెస్టింగ్ స్టోరీతో రానుంది. ఇందులో సూర్య, బాబీ డియోల్ ప‌ర్‌ఫార్మెన్స్ అదిరిపోతుందని అంటున్నారు. చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది ఏకంగా పది భాషల్లో రిలీజ్ చేస్తుండ‌డం విశేషం.