Samantha| ఎట్ట‌కేల‌కి స‌మంత‌కి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన డాక్ట‌ర్..త‌ప్పంతా అత‌నిదే అంటూ ఫైర్

Samantha| టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత మయోసైటిస్ వ్యాధి బారిన ప‌డ‌డంతో సినిమాలు కాస్త త‌గ్గించిన విష‌యం తెలిసిందే. అయితే సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ని ప్ర‌జ‌ల‌కి తెలియ‌జేస్తుంది. కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఆరోగ్య చిట్కా

  • By: sn    cinema    Jul 07, 2024 8:30 AM IST
Samantha| ఎట్ట‌కేల‌కి స‌మంత‌కి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన డాక్ట‌ర్..త‌ప్పంతా అత‌నిదే అంటూ ఫైర్

Samantha| టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత మయోసైటిస్ వ్యాధి బారిన ప‌డ‌డంతో సినిమాలు కాస్త త‌గ్గించిన విష‌యం తెలిసిందే. అయితే సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ని ప్ర‌జ‌ల‌కి తెలియ‌జేస్తుంది. కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఆరోగ్య చిట్కా ఇప్పుడు పెద్ద కాంట్ర‌వ‌ర్సీ అయింది. హైడ్రోజన్ పైరాక్సైడ్ నెబ్యులైజేషన్ వాడకంపై స‌మంత చెప్పిన చిట్కా చాలా డేంజర్ అని ప్రముఖ వైద్య నిపుణులు హెచ్చరించారు. మ‌నుషుల ప్రాణాలు పోయేలా సల‌హ‌లు ఇస్తున్న స‌మంత‌ని జైలుకి పంపాలంటూ కూడా కొంద‌రు డిమాండ్ చేశారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల కూడా సామ్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

‘జనాలకు హెల్త్ టిప్స్ ఇస్తున్న సెలబ్రిటీలను ఒక్క ప్ర‌శ్న అడుగుతున్నాను. మీ చికిత్సా విధానం వ‌ల‌న అవ‌త‌లి వారికి హాని జరిగితే మీరు బాధ్య‌త వ‌హిస్తారా? స‌ల‌హా ఇచ్చిన డాక్ట‌ర్ బాధ్య‌త తీసుకుంటారా అని అడుగుతున్నాను అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అయితే త‌న‌ని జైల్లో పెట్టాలంటూ వార్నింగ్‌ ఇచ్చిన డాక్టర్‌ పోస్ట్‌పై సమంత స్పందిస్తూ.. తాను తీసుకుంటున్న వైద్యం చాలా ఖరీదు. డ‌బ్బులు లేని వాళ్లు ఈ వైద్యం ఎలా తీసుకుంటారో అని ఆలోచించి స‌ల‌హ ఇచ్చాను. అయితే ఓ పెద్ద మ‌నిషి నా పోస్ట్‌ని, స‌ల‌హాలని దారుణ‌మైన ప‌దాల‌తో దూషించారు. నన్ను నిందించడం కంటే నాకు చికిత్స చేసిన డాక్టర్‌తో ఆయన ముఖాముఖిలో పాల్గొని ఉంటే బాగుండేది అని స‌మంత డాక్ట‌ర్‌ని ఉద్దేశించి కామెంట్ చేసింది.

ఈ క్రమంలో స‌మంత‌ని విమ‌ర్శించిన డాక్టర్‌ లివర్‌ డాక్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో నోట్‌ షేర్‌ చేశారు. “నేను సమంత ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకొని త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా. స‌మంత పోస్ట్‌పై నేను వాడిన ప‌దజాలం ఆమెకి బాధ క‌లిగించింది. ఇందుకుగాను నేను క్ష‌మాప‌ణ‌లు కోరుతున్నా. నేను కావాల‌ని చేసిన‌ది కాదు, అనుకోకుండా అలా జ‌రిగింది. త‌ప్పంతా చికిత్స చేసిన డాక్ట‌ర్‌ది. సొంత లాభం కోసం సమంత స్టార్‌ డమ్‌ని ఆ డాక్ట‌ర్ ఉపయోగించుకున్నాడు. సమంత లాంటి సెలబ్రిటీల ద్వారా హనికరమైన సమచారాన్ని ప్రజలకు ప్రచారం చేర‌వేస్తున్నందుకు నేను దీనిని ఖండించాను అని స‌ద‌రు డాక్ట‌ర్ చెప్పుకొచ్చాడు.